పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
42
అబలాసచ్చరిత్ర రత్నమాల.

బడినపిదప నామె దేహము కొంచెము స్వస్థపడెను. కాని యామెరోగ మసాధ్యకరమయినదని డాక్టరు లప్పుడె కనిపెట్టి యాసంగతి కృపాబాయికిఁ దెలిపిరి. అందువలన నామె యెంత మాత్రమును చింతించినది కాదు.

ఆమఱుసంవత్సర మామె యాప్తు లొకరిద్దఱు గతించుటచే నాదు:ఖమువలన నామెరుగ్ణత మఱింత హెచ్చసాగెను. ఇట్లు దేహ మస్వస్థమైనను లక్ష్యముచేయక కృపాబాయి తనలేఖనక్రమమును జరుపుచుండెను. ఆసమయమునందే యామె 'కమలా' యనుప్రబంధ మొకటివ్రాయసాగెను. నీలగిరి యందలి చల్లగాలివలన నామె కాఁరోగ్యము కలుగునని తలచి యామె నటకుఁ బంపిరి. కాని యచట నామెరోగము హెచ్చెను. అచట నుండునపుడే కృపాబాయి తనరుగ్ణత హెచ్చుచున్నను సరకుగొనక కమలయను ప్రబంధము వ్రాసి ముగించెను. పిమ్మట నాప్రబంధ మొకమాసపత్రికయందు ముద్రింపఁబడి ప్రచురింపఁబడియెను. అందుచేతఁ గృపాబాయికి మిగుల నానందము కలిగెను. ఆమె హిందూస్త్రీయై యుండియు నాంగ్లేయభాషయందు వ్రాసిన యీగ్రంథములు మిగుల ప్రశంసనీయములుగా నున్నవని నుడివెదరు. వానిఁ జదివినయెడల ప్రబంధరచనయందుఁ బ్రవీణుఁ డయిన యొకానొకయాంగ్లేయదేశీయునిచే వ్రాయఁబడిన వని తోఁచునఁట. ఈసాధ్వీమణి 1894 వ సంవత్సరము ఆగస్టు 8 వ తేదిని పరలోకగమనము చేసెను. మృత్యుసమయమున కామెకు ముప్పదిరెండు సంవత్సరముల ప్రాయ ముండెను. కృపాబాయి యింకను కొన్ని సంవత్సరములు జీవించి యుండినయెడల నింకను