పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
38
అబలాసచ్చరిత్ర రత్నమాల.

మిషనరీపాఠశాలలో విద్యాభ్యాసమునకయి పంపిరి. అచటికిఁ బోవువఱకు కృపాబాయి తనతోడిబాలికలతో సాటిగా తనకు విద్య రాదనుకొనుచుండెను. కాని యచటి కరిగినపిదప నాపాఠశాలయందలి బాలికల కందఱికంటెను ఈమెయే విద్యయం దధికురాలని నిర్ణయమాయెను. అందువలనఁ భాఠశాలాధ్యక్షుఁ డామె నేతరగతియందును జేర్చక విడిగా విద్య నేర్పున ట్లేర్పాటు చేసెను. అచట నుండుకాలములో కృపాబాయికి వైద్యవిద్యానిపుణురా లగు నొకయమెరికాస్త్రీతోడి సహవాసము కలిగెను. కాన నామె సాంగత్యమువలనఁ గృపాబాయికి వైద్యవిద్య నేర్చుకొనవలయునని యిచ్ఛపొడమెను.

కృపాబాయికిఁగల యాసక్తియుఁ దెలివి తేటలును గని వైద్యవిద్యాభ్యాసము కొఱ కామె నింగ్లండున కనుపవలయునని యామె యాప్తులకుఁ దోఁచెను; గానియామెశరీరమున కాదేశపుగాలి సరిపడదని తెలిసినందున నాప్రయత్నమును మానుకొనిరి. తదనంతరము చెన్న పట్టణమునందలి మెడికల్ కాలేజియందు స్త్రీలకు వైద్యవిద్య నేర్పునట్లేర్పడినందున కృపాబాయి వైద్యవిద్య నేర్చుకొనుటకై చెన్న పట్టణమునకుఁ బోయెను. అపు డామె యొంటరిదైనందున నాగ్రామమునందు వసియించు రెవరెండు సత్యనాధనుగారను గృహస్థునియింట వాసముచేయుచుండెను. అసత్యనాథన్‌గారు మిగుల పెద్దమనుష్యులు. ఆయనభార్యయుఁ గొమార్తెయు మిగుల మంచివారగుటచే వారుకృపాబాయి సద్గుణములను గని యామెయం దధిక ప్రీతి గలిగియుండిరి. అందువలన కృపాబాయికి వారింట నున్న దినము లధిక సుఖప్రదములుగాఁ గడచెను. ఇట్లీమెయొక సంవ