పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృపాబాయి

37

రారోగ్యకరము లగుదుస్తులను ధరియించు నలవాటు గలిగి యుండుటచే వారిపిల్లలకు విలువవస్త్రములయం దెంతమాత్రము నిచ్చలేక వారుమిగుల వినయముతో వర్తించుచుండిరి.

ఇట్లు ధీమతి యైనతల్లిచే నన్నిరీతుల సురక్షిత యైనందున నామెకుఁ చిన్న తనమునందుఁ దండ్రిలేని లోపమంతఁగాఁ గానుపించదయ్యె. కృపాబాయి బాల్యమునుండియే మిగుల తెలివి గలది యనిపించుకొనెను. ఈమె విద్య నభ్యసించునపుడు తనసహోదరునితోడఁ గూర్చుండి చదువవలయునని కోరుచుండెనుగాని యామె తనవద్ద చదువ కూర్చుండినచో తనతప్పిదములను దిద్దునని యెంచి యట్టియవమానమున కోర్వఁజాలక యామె సహోదరుఁ డామెను డగ్గరఁ జేరనిచ్చెడివాఁడు కాఁడు. చిన్న యన్న యిట్లు చేసినను కృపాబాయియొక్క జ్యేష్ఠభ్రాత యగుభాస్కరుఁడు తనముద్దు చెల్లెలియం దధిక ప్రీతి కలవాఁడై యామె విద్యాభ్యాసము చక్కఁగా జరుపుచుండెను. ఆమెకు సృష్టిసౌందర్యవలోకమునం ధధికప్రీతిగాన నామె నిత్యము భాస్కరునితోడఁ బోయి యనేకపర్వతములను, వనములను, ఉపవనములనుదప్పక చూచుచుండెను. అల్పవయసునందుసహిత మామెకు సృష్టిసౌందర్యముఁ గనిన మిగుల నానందము గలుగుచుండెను. ఇట్లుండఁగాఁ గొంతకాలమునకు భాస్కరుఁడును దివి కరిగెను. తనశ్రేయము నపేక్షించు ప్రాణ సమానుఁ డగుసహోదరుఁడు చనిపోయినందువలన కృపాబాయియొక్కదు:ఖ మపారమయ్యెను. ఆదు:ఖమువలననే యామె దేహమునకస్వస్థత ప్రాప్తమాయెను. ఆమెదు:ఖమును మఱవవలయునని యామెను బొంబాయినగరమునందలి జనానా