పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
33
పద్మిని.

కాని నాదాసీల పరువునకును రాణివాసమునకును మీసైనికులు భంగము సేయకుండునటుల కట్టుదిట్టములు చేయవలయును" పద్మిని తెలిపినవార్త విని అల్లా ఉద్దీను పరమానంద భరితుఁడయ్యెను. అంత నాతఁడామె యన్నప్రకార మొప్పుకొని యామెకుఁ ద్వరతో రమ్మని కబురుపంపెను. బాదుషా యొద్దినుండి తనపలుకుల కంగీకారము వచ్చుట విని పద్మిని తాను ప్రయాణమాయెను. ఆమెతోడ వచ్చుటకు నేడువందల మేనాలను సిద్ధపరచెను. ఒక్కొకమేనాలో ముగ్గు రేసిశూరులు ఆయుధహస్తులయి కూర్చుండిరి. ప్రతిమేనాకును నాఱు గురు వంతున గుప్తాయుధు లగువీరు లాయందలములను మోయుచుండిరి. పద్మిని తనసైన్యమునకును తనకును దోడుగా గోరాసింహునిని, నాతనిపుత్రుఁడగు బాదలుని సహితము తనతోఁ దీసికొనిపోయెను. ఇట్లువీరందఱు తురకలశిబిరమును సమీపించి బాదుషాయాజ్ఞవలన నామేనాల నన్నిటిని శిబిరములోనికి నిరాతంకముగాఁ గొనిపోయిరి. తదనంతరము పద్మిని భీమసింహుని నొకసారి చూచెదనని బాదుషాకుఁ దెలిపి భీమసింహుని కైదుచేసినస్థలమునకుఁ దనమేనాను బట్టించుకొనిచనెను. అంత స్త్రీవలెనున్న యాగుప్త సైన్యమంతయు తమనిజస్వరూపమును గనఁబఱచి శత్రుసైన్యముల దైన్యము నొందిపసాగెను. భీమసింహుఁడదియంతయు నేమని యడుగుచుండగా పద్మిని యాతనిని త్వరపెట్టి సిద్ధపఱచితెచ్చిన అశ్వములపై తానును భర్తయునెక్కి యాసంగ్రామపు సందడిలోనుండి తప్పించుకొని క్షణములో చితూరు ప్రవేశించెను. ఇచట గోరాసింహుఁడు సైన్యాధిపత్యము స్వీకరించి యాతురకల నోడించెను. కాని యర్జున