పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మిని.

31

ళ్లుదును." ఈవర్త మానము విని కొంతరోషము కలిగిననుపోరునకు విసుగు కలిగిన రజపూతు లందున కొప్పుకొనిరి. తదనంతరమా సంగతి భీమసింహుఁడు పద్మినికిఁ దెలుపఁగా నామె తాను ప్రత్యక్షముగా నాపరునికంటఁ బడనని స్పష్టముగాఁ దెల్పెను. అందుపయి భీమసింహుఁడామెకు నామె డిల్లీశ్వరునకుఁ గనిపించని పక్షమున రజపూతులకుఁ గలుగు బాధల నెఱిఁగింపఁగా నామె యద్దమునందుఁ దనప్రతిబింబమును బాదుషాకుఁ జూప నొప్పుకొనెను. అప్పడు "పద్మిని నీకగుపడఁజాలదు; గాన నామె ప్రతిబింబమును జూపెద" మని చితూరునుండి అల్లా ఉద్దీనుకుఁ జెప్పి పంపిరి.

అందుపయి యుద్ధము నాపి నియమితదివసంబున నొక రిద్దఱు సేవకులతో అల్లాఉద్దీను పద్మినిని జూచుటకయి చితూరు కోటలోనికి వచ్చెను. అచట భీమసింహుగా రాయనకుఁ దగు మర్యాదలు చేసి యాతనికి దర్పణంబున పద్మినిరూపమును జూపెను. తాను విన్నదానికంటెను పద్మిని విశేషరూపవతి యగుటఁ గనినందున బాదుషాయొక్క చిత్త చాంచల్య మినుమడించెను. దానిని మనమునం దడఁచుకొని యాతడు మరలిపోవునపుడు తనకృత్యమునకుఁ బశ్చాత్తాపపరుఁ డయి నటుల భీమసింహునితో నిట్టు లనియె. "భీమసింగుగారూ! నేను చేసిన నేరమును మన్నించవలయును. నేఁడాదిగా చితూరు సంస్థానీకులతో నేను సఖ్యము చేయఁ దలఁచితిని. ఇంతవఱకు మియోగ్యత తెలియకపోవుటవలన నేవైరము తలపెట్టితిని. కాని నేఁడు మీయోగ్యత నాకన్నులార చూడఁగా మీవంటి మిత్రులు దొరకుట నాకు మిగుల శ్రేయస్కర మని తోఁచు