పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
25
కొమఱ్ఱాజు జోగమాంబ

దురు. ఆగ్రామ మిప్పుడొక పెద్దపల్లెవలె నుండును. కానియచటి భూమిత్రవ్విన బయలఁబడు గుళ్ళరాళ్లును, మేడలస్థంభములును, దూలములును, శిలాశాసనములును ఆపట్టణ మొకప్పుడు గొప్పపట్టణముగా నుండెనని స్థాపించుచున్నవి.

కొమఱ్ఱాజువారును పూర్వమునుండి యాపట్టణమే వాసస్థలముగాఁ గలిగియుండిరి. వీరు పూర్వము రెడ్లకాలములోను, రాజులకాలములోను, తురుష్కులకాలములోను దేశపాండ్యాగిరిచేసి మిగుల కీర్తిఁగాంచిరి. ఆంగ్లేయరాజ్య మారంభమైనది మొదలు దేశపాండ్యాగిరి పోయినందున వారాగ్రామమును విడిచి యుద్యోగముల నిమిత్తము అనేకదేశముల కరుగవలసిన వార లయిరి. అయినను వారు స్వగ్రామప్రీతిని విడువఁ జాలని వారయి యచ్చట నిండ్లను కట్టుకొని కొందఱప్పుడప్పుడచటికి వచ్చి కొన్నిదినము లుండి పోవుచుందురు.

జోగమాంబ భర్తయునీగ్రామమునందు గృహము గలవాఁడయి నైజామురాజ్యములో నుద్యోగము గలిగి యొక యధికారమునందుండెను. జోగమాంబ మనపూర్వగ్రంధములలోఁ జెప్పఁబడిన పతివ్రతాధర్మములను దప్పక నడిపెను. ఆమె భర్తను దేనివుగా భావించి నిత్యము నాతనిని బూజింపుచు నాతనియాజ్ఞకానిది యామె భోజన మజ్జనశయనాదులు చేయుటలేదు. భర్తయుచ్ఛిష్టము లేనిది యామె యెన్నఁడును భుజియింపకుండెను. ఈవ్రతమువలన నామె కనేకసమయముల యందునుపోష్యములు చేయుట తటస్థింపచుండెను. ఇందున కొకదృష్టాంతము చెప్పెదను. ఒకసారి భర్తగ్రామాంతరమున కరిగి బహుదినములవఱకు రానందున నామె దాఁచి యుంచు