పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కొమఱ్ఱాజు జోగమాంబ.

              క. పతిగొట్టినఁ బతితిట్టినఁ
                  బతినిర్దయుఁడగుచు నెట్టిబాధపఱచినన్
                  మతి నన్యధాత్వ మొందరు
                  పతిదేవత లతివ నీకుఁ బ్రతియగువారల్.
                                           [పాండురంగవిజయము]

ఈపతివ్రతాతిలకము రమారమి యేఁబదిసంవత్సరములకుఁ బూర్వముండెను. కృష్ణామండలమునందలి నందిగామతాలూకాలో కంచలయనుగ్రామ మొకటికలదు. అపల్లెయందు భండారు వీరయ్యయను ఆఱువేల నియోగిబ్రాహ్మణుఁ డొకఁడు వాసముచేయుచుండెను. ఆయన దైవభక్తుఁడును, సత్ప్రవర్తకుఁడునునై యుండెను. ఆయనకు జోగమాంబయని యొకకూఁతురు జనియించెను. ఈకన్యక చిన్నతనమునుందుననే బహుగుణవతిగా నుండెను. జోగమాంబ వివాహయోగ్యకాఁగా నాతాలూకాలోనిదగు పెనుగంచిప్రోలను గ్రామనివాసియగు కొమఱ్ఱాజు నాగయ్యకొమారుఁడగు రామయ్యయను నాతనికిచ్చి వివాహము చేసిరి.

ఈ పెనుగంచిప్రోలు పూర్వము గొప్పపట్టణముగా నుండినందున దీనిని పెదకంచియను చుండిరనియు, పెనకంచియను దానికె పెనుగంచి యని యపభ్రంశమయ్యె ననియుఁ జెప్పు