పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగన్మోహిని.

23

గంటలకొలఁది సంభాషింపుచుండిరి. అప్పుడామెకుఁ గల ధర్మ బుద్ధియు, ధర్మప్రచారమునందుఁ గలప్రీతియుఁ బ్రహ్మసమాజీకులందఱియందుఁ గలప్రేమయు, నీశ్వరునియందలి యనుపమేయమగు శ్రద్ధయుఁ గని వారి కామెయెడల నంతకంతకుఁ బూజ్యభావము హెచ్చుచుండెను. ధర్మప్రచారకుల కెవ్వరికేని యొక సంకటము తటస్థించినచో వారు తల్లితుల్యురాలగు జగన్మోహినీ దేవికడకువచ్చి తమదు:ఖముల నామె కెఱిఁగించి యామె వలన సంకట నివారితులై చనుచుండిరి. ఈమె 1898 వ సంవత్సరము మార్చినెలలో పరలోకమున కేగెను.