పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జగన్మోహిని.

(బాబు కేశవచంద్రసేనుని భార్య)

ఈమె కలకత్తాకు సమీపముననున్న అగర్ పడార యనుగ్రామమున చంద్రకుమార్ ముఝమదారు భార్యకు క్రీ. శ. 1847 వ సంవత్సరము డిసెంబరు 26 వ తేదిని జన్మించెను. పుట్టినింట చిన్నతనమునందీమెను గులాబ్ సుందరియని పిలుచుచుండిరి. గులాబ్ సుందరిని తొమ్మిదవసంవత్సరముననే బాబు కేశవచంద్రసేనుల కిచ్చి వివాహముచేసిరి. ఈ కేశవ చంద్రసేనులే పిమ్మట బ్రహ్మమతావలంబియై మిగుల ప్రఖ్యాతిఁ గాంచెను. జగన్మోహిని యత్త వారియింటికి వచ్చినపిదప నామె భర్త మిగుల వైరాగ్యశీలుండయి యుండెను. ఆయన యంగీకరించిన మతమునుగూర్చి యింటనుండువా రాతనినేకాక యతనిభార్యను సహిత మనేక బాధల పఱుచుచుండిరి. జగన్మోహిని కప్పుడు ధర్మము సంగతి యెంతమాత్రమును దెలియకున్నను తనపతియందలి భక్తిని విడువక యితరులుచేయు నింద నతని చెవినిఁ బడనియ్యక పతిని సంతోషపఱుపఁ బ్రయత్నింపు చుండెను. ఇట్లుండఁగాఁ దనబంధువులలోనుండి తనమతానుసార ప్రవర్తన నడుపుట దుస్తరమని తలఁచి 1861 వ సంవత్సరము బ్రహ్మసమాజోత్సవము జరుగుచుండఁగా కేశవచంద్రసేనులు స్వగృహత్యాగముఁ జేసి యాసమాజమునందుఁ బూజ్యుఁడుగా నెన్నఁబడుచున్న మహర్షి దేవేంద్రనాథుని యింటికి