పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
20
అబలాసచ్చరిత్ర రత్నమాల.

వదలి యతఁడు అయోధ్యకుఁ బాఱిపోయెను. స్త్రీల నన్యాయముగాఁ జెఱఁ బెట్ట యత్నించినవాఁడని ప్రజలాతని నిందింప సాగిరి. ఆనవాబునుగుఱించి యొకకవి యిట్లువ్రాసియున్నాడు : _

                గీ. స్త్రీలఁ జెఱఁబెట్ట యత్నంబుఁ జేసినట్టి
                    శూరవరుఁ డని లోకులు దూర నతఁడు
                    వృద్ధుఁడయి చాల ప్రాణముల్ విడుచువఱకు
                    నమిత మైనట్టి దుష్కీర్తి ననుభవించె.

Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf