పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
19
అర్గళసంస్థానాధీశ్వరి.

తురుష్కులపై శరపరంపరల నిగుడింపసాగిరి. 'హరహరమహదేవ[1]' యనుశబ్దము చేయుచు శత్రువుల శిర:కమలములు మహా దేవున కర్పింపసాగిరి. ఇట్లు వారు శత్రుసేనలతోడఁ బోరుచు, రాణిగారిని సమీపించిరి. రాణిగారును, పరిచారికలును శత్రువులతో బెనఁగుచు నాత్మసంరక్షణము చేసికొనుచుండిరి. హిందూ సైనికులు తమకు సహాయులగుటఁ గని యాశూర స్త్రీల ధైర్యము రెట్టింపఁ దమమహాద్భుతశౌర్యముచే విద్యుల్లతలవలె మెఱవసాగిరి. రాణిగారిని మధ్యనుంచుకొని, చుట్టును సంరక్షకులను నియమించి యాస్త్రీపురుష మిశ్రమమైనస్వల్ప హిందూ సేన శత్రుసైన్యమునుండి మెల్లమెల్లఁగా త్రోవ చేసికొని ముందు నడువసాగెను. కాని ప్రతియడుగునకును హిందూ వీరుల సైనికులు శత్రువులచేహతు లగుచుండిరి. ఇట్లత్యంతశ్రమతో వారు కొంచెముదూరము నడుచునప్పటి కాసంగతి రాజునకుఁ దెలిసి రాణి సహాయార్థ మొకగొప్ప సైన్యమువచ్చెను. అందువలన రాణిగారి కేమాత్రమును భయము లేక యామె రాజమందిరము ప్రవేశించెను. నిర్భయచందు యుద్ధములో మడిసెను. అభయచందు శౌర్యధైర్యములకు రా జత్యంతానందపరవశుఁడయి తనకూఁతు నాయన కిచ్చి వివాహము చేసెను. కాని అయోధ్య నవాబుస్థితి యత్యంత శోచనీయ మయ్యెను. ఆయనపై వెంటనే గౌతమరాజు సేన నంపుటవలన భీతిచే నచటికిఁ దానుతెచ్చిన యుద్ధసామగ్రినంతయు నచటనే

======================================

తురకలు దీన్ దీననుచు యుద్ధమునకు వెడలు నటులే రజపూతులును మహా రాష్ట్రులును హర హర మహా దేవ యను శబ్ధమును నుచ్చరించుచు సంగ్రామమునకు వెడలెడి వారు అని తెలియునది.

  1. తురకలు దీన్ దీననుచు యుద్ధమునకు వెడలు నటులనే రజపూతులును మహారాష్ట్రులును హరహరమహాదేవ యనుశబ్దమును నుచ్చరించుచు సంగ్రామమునకు వెడలెడివారు అని తెలియుచున్నది.