పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/309

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గణపాంబ

ఈమె బేటరాజునకు భార్య; గణపతిదేవునకుఁ గూతురు ఈగణపతిదేవుఁడు క్రీ. శ. 1245 వ సంవత్సరమునుండి 1292 వ సంవత్సరమువఱకును నోరుగంటిరాజ్యముఁ బాలించిన రాజేయైయుండిన చోనీగణపాంబరుద్రమదేవికిఁ గూతురైయుండును. కానియిందునకుఁ బ్రబలనిదర్శనము లేవియుఁగాన రాకున్నవి. గణపాంబయుఁదనపతి మరణానంతరమునందాతని యేలుబడిలోనుండిన యాఱువేలగ్రామములనుమిగుల నేర్పుతోఁబాలించెను. ఆమె మిక్కిలి యౌదార్యవతియై యనేకవిధములైన ధర్మకార్యములను జేసెను. ఈమె ధర్మకృత్యములను జరితమును దెలుపు శిలాశాసనమొకటి కృష్ణా మండలములోఁ జేరియున్న గుంటూరు తాలూకాలోనున్నది. దానిలోని కొన్ని సంగతుల నిందుఁ బొందు పఱచెదను.

"మిగుల ప్రసిద్ధిఁగాంచిన కాకతీయవంశమునందు అనేక ప్రభువులు రాజ్యము చేసినమీదట వైరిభీకరుఁడగు బేటరాజు సింహాసనారూఢుఁడయ్యెను. శివునకుఁ బార్వతివలెను, విష్ణువునకు లక్ష్మివలెను, ఈబేటరాజునకు గణపాంబ ధర్మపత్ని యయ్యెను. ధర్మకటకపురిని మిక్కిలి యోగ్యముగా బాలించి బేటరాజు కీర్తి శేషుఁడయ్యెను. తదనంతరం బాతనిభార్యయగు గణపాంబ సింహాసన మెక్కెను. ఈమె భర్తయొక్క సుగతి