పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/302

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
288
అబలాసచ్చరిత్ర రత్నమాల.

తనమువారు ఒక గొప్పసభ జరిగించి యందు సువర్ణమయి గారికి "మహారాణి" యనినబిరుదు నొసంగిరి. 1874 వ సంవత్సరమున హిందూదేశమునందంతట గొప్పక్షామము కలిగి యన్నములేక ప్రజలునాశము నొందుచుండినప్పుడు మహారాణిగారు వేలకొలఁది కుటుంబములకు నన్నదానము చేసి యనేకులను మృత్యుముఖమునుండి విడిపించిరి. అన్నివిధముల నుత్తమ రాలగు నీమెకుఁ బ్రభుత్వము వారు "మీసంస్థానమునకు మీరు ముం దేర్పఱుపఁ బోవువారసుదారునికిఁగూడ మేము 'మహారాజా' యను బిరుదు నొసంగితి"మని తెలియఁ జేసిరి.

1878 వ సంవత్సరమునందు "మెంబరు ఆఫ్ ఇంపీరియల్ ఆర్డర్ ఆఫ్ దిక్రౌన్ ఆఫ్ ఇండియా" యను బిరుదు రాణిగారి కొసంగఁబడియె. ఆసమయమున దొరతనమువారు కాసింబాజారులోని రాజగృహమందు రమ్యమయిన గొప్ప సభచేసి రాజప్రతినిధి గారికి బదులుగా పీకాకుదొరగారు స్వర్ణమయిగారి నప్పుడు సంబోధించి యీప్రకారము వక్కాణించిరి : _

పరోపకారార్థమై తమరనేక పర్యాయములు గొప్ప ధనరాసులు వెచ్చించిన సంగతి దొరతనమువారు విని తమను గౌరవించుటకై తమకీబిరుదు నిచ్చుచున్నారు. 1871 వ సంవత్సరమునుండి 1875 వ సంవత్సరమువఱకు తమరు 52500 రూపాయలు జనహితకార్యములకయి వ్యయపఱచితిరి. ఈ ధనము తమయాదాయముయొక్క షష్ఠాంశమునకంటె నధికమయినది. ఇంతియకాక దానము చేయునప్పుడు తమరు చూపెడు వివేచనాశక్తి, దూరదర్శిత్వము మొదలయినవాని