పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/301

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
287
మహారాణిస్వర్ణమయి.

ఈమె చేయుధర్మకార్యముల సంగతి విని దొరతనము వారీమె కనేక పర్యాయము లనేక బిరుదముల నొసఁగిరి. ఈమె యౌదార్యము విక్టోరియాచక్రవర్తిని గారికిఁగూడ బాగుగాఁ దెలియును. మహారాణిగారి పరోపకారమునకు శ్రీచక్రవర్తినిగా గారుమిగుల సంతోషించి యీదేశమునం దిదివఱ కెవ్వరికి నియ్యని "క్రౌన్ ఆఫ్ యిండియా" యను పదవిని స్వర్ణమయి గారికినిచ్చిరి. ధనసంపన్న లయినస్త్రీలు సాధారణముగాఁ దమ యన్న దమ్ములు మొదలయిన బంధువులకు సహాయము చేయుదురు. కాని తదితరులకుఁ జేయరు. కాని స్వర్ణమయిగారియందుమాత్రము బాంధవపక్షపాతము, స్వజాతిపక్షపాత మన్న మాట లేశమయినను లేకుండెను. ఆమె సర్వజనులను సమదృష్టితో నరయుచుండెను.

1847 వ సంవత్సరమున రాణిగారికిఁ దమయాస్తి యంతయు స్వాధీనమయ్యెను. అదివఱకు సంస్థానముమీఁద విశేషఋణము పెరిగియుండెను. స్వర్ణమయి తెలివిగల మంత్రిని నియమించికొని కొద్దిదినముల కే సంస్థానమునకుఁ గల ఋణమంతయుఁ దీర్చివేసెను. ఇంతియకాక ప్రతిసంవత్సరమును వచ్చు నాదాయమునుగూడఁ బెంచెను. కాని యిట్లధికముగ వచ్చుధనమును రాణిగారు నగలకుఁగాని మఱియేవ్యర్థకార్యములకుఁగాని వెచ్చింపక రాజ్యమునందలి ప్రజల నాగరికత వృద్ధిచేయుటకును, పన్నులభారముచే నణఁగిపోవుచున్న వ్యవసాయదారులకును సహాయము చేయుటకును, నింక నెన్ని యో మంచికార్యములకును వినియోగించిరి. మహారాణిగారు చేయు మహాకార్యములం జూచి 1871 సంవత్సరమున దొర