పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

అబలాసచ్చరిత్ర రత్నమాల.

కును నత్యంతావశ్యకమైన పరోపకారమను విద్యయం దీమె యసమానమైన పాండిత్యమును సంపాదించి యుండెనని మాత్రము చెప్పవచ్చును. ఆపన్నులను విపత్తునుండి తొలఁగించుట, అనాధవితంతువుల నేత్రంబులనుండి ప్రవహించు కన్నీటినాపుట, క్షుధార్తులగువారికి నన్నముపెట్టుట, వస్త్రహీనులకు వస్త్రము లొసంగుట, ఇండ్లిలేనివారికి గృహదానము చేయుట, విద్య నెఱుఁగని వారికి విద్యాదానము చేయుట, గ్రంధకర్తలను సన్మానించి వారిచే సద్గ్రంధములఁ జేయించుట, వ్యాధిగ్రస్తుల కౌషధంబు లిప్పించుట మొదలగు పరోపకార కృత్యంబులు చేయుట కెట్టివిద్యానైపుణ్యము కావలయునో యట్టివానియందు సువర్ణమయి పారంగతమయి యుండెను. ఈరాణికి సంతానము లేకపోయినను నీమే విశ్వమే తన కుటుంబ మని యెంచునదిగాన నాపదయందుఁ జిక్కుకొనువారందఱు నీమె సంతానమనియే చెప్పవచ్చును. అయితేయీమె స్త్రీయైనందున యుక్తాయుక్తవివేచనములేక దానము చేయుచుండెనని యెంచఁగూడదు. స్వర్ణమయి పాత్రాపాత్రములఁ గనుఁగొనియే మఱి దానము చేయుచుండెను. ఈమె మంత్రియగు రాయరాజీలోచన్ రాయబహద్దరుగారు గొప్ప విద్వాంసులు, ప్రజ్ఞావంతులును, పరోపకారదక్షులునునై యుండినందున దానము చేయునెడ రాణిగారి కెప్పుడును సహాయులయి యుండుచుండిరి. రాణిగారి ధార్మికబుద్ధి యిట్టిదని చెప్ప నిలవిగాదు స్వర్ణమయిగారు స్వహస్తముతో దానము చేయని దిన మొకటి యయినను గానరాకుండెను.