పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/30

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అర్గళ సంస్థానాధీశ్వరి.

"సారాసంబెజయము సంకటమున."

ఈమె విహారదేశమునందు బక్సరుపట్టణసమీపమునం దున్న అర్గళసంస్థానాధీశ్వరునిభార్య. ఈమె నామ మెచటను తెలియుమార్గము లేనందున కెంతయుఁ జింతిల్ల వలసి యున్నది. ఈ కాంతారత్నమును భార్యనుగాఁ పడసిన సంస్థానపతి పేరు గౌతముఁడు. ఆయన ఢిల్లీశ్వరునకుఁ గప్పము కట్టనందువలన ఢిల్లీపతి కాయనపై నధిక కోపమువచ్చి ఆయన నోడించి యతని రాజ్యమును వశపఱుచుకొనుమని అయోధ్య నవాబునకు ఢిల్లీశ్వరుఁ డుత్తరువు చేసెను. అంత నానవాబు సైన్యసహితముగా గౌతమరాజుపై యుద్ధసన్నద్ధుఁడై రాఁగా గౌతముఁడు సామాన్యుఁడు కానందువలన తా నొక చిన్న సంస్థానాధీశ్వరుఁ డైనప్పటికి, శత్రువులకు జంకక వారితోఁ బోరి వారిని పరాజితులఁ గావించెను. ఇట్లు విజయముఁ బొంది విజయోత్సవములతో రా జింటికి వచ్చినందున నాఁ డాపట్టణమునం దంతట నుత్సవము లనేకములు జరుగుచుండెను.

ఇట్టిసంతోషకాలమునందు రాణీగారికి గంగాస్నానము చేయవలయునని యిచ్చపొడమెను. గంగాప్రవాహ మర్గళపట్టణ సమీపముననే యున్నను, పరాజితు లయిన శత్రువు లచ్చట దాఁగియున్నందున నచటికి స్నానమునకుఁ బోవుట యతికష్టతరమైయుండెను. అయినను ఎటులనైన గంగాస్నానము చేయవలయునని రాణిగారు నిశ్చయించుకొనినందున తనవేషమును