పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్వత్కుటుంబము.

283

వచ్చెనో తెలియదుగాని యీమెద్రావిడమున నీతిశాస్త్రము నొకదానిని రచియించెను. ఈమెయు యావజ్జన్మము వివాహము చేసికొనలేదు.

మూఁడవదియగు వాలీజ్ : _ ఈమె అవ్వయర్ రెండవ చెలియలు. తల్లిదండ్రు లీమెను విడిచి చన కార్ వార్‌కులమువా రీమెను బెంచిరి. ఈమె యనేక ద్రావిడకావ్యములను రచియించెను.

నాల్గవదియగు ముదగ్గా : _ ఈమె అవ్వయర్ గారి మూఁడవ చెలియలు. ఈమె యొకవర్తకుల యింటఁ బెరిగెను. ఈమెయు ద్రావిడమున ననేక కావ్యములను రచియించెను. వీరందఱు తమ నిజమయినకులము నెఱుఁగకున్నను దమవిద్యా ప్రభావము వలననే జగత్ప్రసిద్ధలైరి. కాన విద్యవలననే మనుష్యులు పూజ్యతను గాంతురుగాని కులము వలనఁగాదని తెలియుచున్నది.