పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్వత్కుటుంబము.

281

యామె వృత్తాంతమునంతను దెలిసికొని యామెను తనపుత్రికనుగా భావించి తనగ్రామమునకుఁ దోడ్కొని పోయెను. ఈమె పోయిన స్వల్పకాలమునకే యా ధనవంతుఁడు కాలముచేసెను. ఆయన తన మరణకాలమునందు తనకుఁగల ధనము తనకొడుకులతో సమానముగా నీమెకుఁ బంచియిచ్చెను. ఆధనముతో నీమెయొక యన్న సత్రముకట్టి పాంధులకు నన్నదానము చేయుచుండెను. ఈప్రకారము కొన్నిదినములు గడచిన వెనుక నాసత్రమునకు పిరలీవచ్చుట తటస్థించెను. అంతనామె తనయలవాటు ప్రకార మతిధిని సత్కరించి యాతని కన్న పానాదుల నిచ్చెను. భోజనానంతర మాతఁడు ఆమెవృత్తాంతము నడిగి తెలిసికొని యామె తనపత్నియని గుర్తించెను. అపుడామెయొక్క సత్ప్రవర్తనముఁగని యాతనికి మిగుల జాలిపుట్టెనుగాని మరలఁ దనను వెంబడించునను భీతిచేత తనసంగతి యామె కెఱుక పఱుప కుండెను.

మఱునాఁ డాతఁడు ప్రయాణమయి పోవుచుండఁగా నామె యాతని నంపుటకయి బైటికి వచ్చి మిగుల నుపచార వచనములతో నతనిని సాగనంపఁ జొచ్చెను. అప్పుడామె వినయభాషణమువలన పిరలీ మిగుల దయగలవాఁడై తనభార్యకుఁ దను నెఱిఁగించెను. అప్పు డాయన నామాట నీవు వినవలయుననియు, నిన్ను నే నెప్పుడును విడువననియు భార్యతోఁ బ్రమాణముజేసెను. అంత నామెయు పిరలీయుఁ గలిసి మెలసి యుండిరి. కొన్నిదినము లాదంపతు లచటనుండి మరల దేశాటనము చేయసాగిరి. అట్లు తిరుగుకాలములో వారికిఁ గ్రమముగా అవ్వయర్, ఆపగ్గా, వాలీజ్, మురగ్గాలను నలుగురు