పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
15
ఉమాబాయిదాభాడే.

అప్పుడు ఉమాబాయియుఁ దనయంబారీచుట్టును చిక్కు తెరలు కట్టించుకొని యాయుధహస్తయై గజారోహణముఁ జేసెను. ఆమెపుత్రు లిరువురును తల్లిపార్శ్వములఁ గూర్చుండిరి. ఈప్రకారము ఉమాబాయి సైన్యసహితముగా సంగ్రామరంగము నలంకరించెను. చూచితిరా యీమెధైర్యము! ఇదేకదా నిజమైనసాహసము.

ఇట్లు పరాక్రమవంతురాలగు ఉమాబాయి ఢిల్లీపతి సేవకుఁడగు జోరవరఖాన్ అను యోధుని నోడించుటకు సిద్ధముగా నున్న సమయమునందు వాఁడును పదివేలసైనికులతో నామె నెదిరించను. అంత నాయుభయసేన లొండొంటిందాకి పోరఁ దొడంగెను. ఇట్లు కొంతవడి సంగ్రామంబు జరిగినపిదప ఉమాబాయి సంగ్రామచాతుర్యము వలన తురకలకు నపజయము కలిగెను. అంత వాఁడు నగరునకుఁ బాఱి నగరద్వారములను మూసికొనెను. యుద్ధము అహమదాబాదుపొలిమేర నే జరుగుచుండినందున, నుమాబాయి సైనికులు వెంటనే పీనుఁగుమీఁద పీనుగును పేర్చి ప్రహరి నెక్కి అహమదాబాదులోనికిఁబ్రవేశించిరి. సత్య ప్రతిజ్ఞయగు నుమాబాయియు అహమదాబాదు కిల్లాలోనాఁడు భోజనము చేసెను.


Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf