పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/288

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
274
అబలాసచ్చరిత్ర రత్నమాల.

మునిఁగిన యోడ తేలుచున్నట్లగుపడెను. అపు డామె తన కాలికిఁ బడవ త్రాడొకటి తాకఁగా దాని యాధారము వలన నాపడవసమీపమునకుఁ బోయి తననగల పెట్టెను కాలితోఁ దీసికొని కాలికే తగిలించుకొని యచట నొకకట్టె యగుపడఁగా దానినిఁ బట్టుకొని యొంటికాలితో నీఁదుచుఁ బోవసాగెను. అప్పుడు సముద్ర ముప్పొంగి మిగుల భయంకరముగా నుండెను. కాని ధనలక్ష్మీ తనధైర్యమును విడువక యొక కాలితో నీళ్ళను త్రోయుచు చేతులతో నీదుచుఁ గొంతదూర మరిగెను. అప్పు డామె కాలుసేతులు మిగుల తీపులు పుట్టినందున నిఁక బ్రతుకుట దుస్తరమని తోఁచి నగల పెట్టెను సముద్రములో విడిచి రెండుకాళ్ళతో నీదఁ దొడఁగెను. ఇట్లీఁదుచు నామె కారేవునకుఁ గ్రోసెడుదూరము వఱకును వచ్చెను ! కాని యచట సముద్ర మామెను ముందుకు నీఁదనీయక వెనుకకు లాగఁ జొచ్చెను. ధనలక్ష్మి తన యావచ్ఛక్తిని వినియోగించి ముందున కీదఁ బ్రయత్నింపు చుండెను. ఇంతలో నొక గొప్పయల వచ్చి యామె నాకాశమున కెగర వేసెను. ఆమె యెగిరినపుడు దూరమున నెవరో మునిఁగిపోవుచున్నటుల నామె కగుపడెను. పిదప నామె సముద్రములోనం బడి తన కగుపడినవాఁడు తనభర్త యయియుండునని చింతించి యతని ప్రాణమును గాపాడ తనకు శక్తి లేనందువలన నతనిని గాపాడుటకయి పరమేశ్వరుని వేఁడుకొనియెను. ఆహా ! అట్టి సంకట సమయమునందు సహిత మా పతివ్రతాతిలకము పతి క్షేమమును చింతింప మఱచినది కాదు ! ఇట్లు పరమేశ్వరుని వేఁడుకొని యతఁడే తనపతినిఁ గాపాడు నని నమ్మి యామె