పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/284

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధనలక్ష్మి

ఈ సాధ్వీస్త్రీ బడోదారాజ్యములోని బీల్నాగ్రామవాసుఁడగు జగన్నాధలక్ష్మీ రాముని కోడలు; జీవరాముని కూఁతురు. ధనలక్ష్మి యత్తపేరు మహాకువరు. ఈమె ధార్మికయు, వినయవతియు, వివేకశీలయు విద్యావతియునై తనకోడలగు ధనలక్ష్మికిని నాగుణములనే గఱపుచుండెను. కొమారుఁడగు గిరిజాశంకరునకుఁగూడ బాల్యమునుండి విద్యాబుద్ధులు నేర్పి యతనిని సద్గుణవంతునిఁ జేసెను. ధనలక్ష్మి వివాహానంతరము జగన్నాధలక్ష్మి రామునికి గౌరవము హెచ్చుచుండెను. మహాకువ రెల్లప్పుడును స్త్రీసతిపుస్తకములను జదువుచు స్త్రీలకు సద్భోధ చేయుచు నీతి, భక్తి, ధర్మములపైఁ గీర్తనలను రచియించి బాలురకును, బాలికలకును నేర్పుట యం దధిక శ్రద్ధగలదియయి యుండెను. ఇట్టి సద్గుణవతియగు నత్తచేతిక్రింద నుండిన కోడలు మిగుల నుత్తమురాలగుట యొకయాశ్చర్యము గాదు. ధనలక్ష్మి యత్తగారి యం దధిక ప్రేమ గలదియయి యెన్నఁడును పుట్టినింటికిఁ బోవనిచ్ఛయింపదయ్యె. ఒకానొకప్పుడు పుట్టినింటివా రామెను బలవంతముగాఁ దీసికొనిపోయినను మూఁడు నాలుగుదినము లచటనుండి మరల నత్త యొద్దికి వచ్చినంగాని యామె మనసు సంతసింపదయ్యె. ఇట్లాయత్తకోడండ్రు తల్లిబిడ్డల కంటె నధికప్రీతి కలవారలయి యుండిరి. ఇదిగదా యత్తకోడండ్రుండ