పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/282

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
268
అబలాసచ్చరిత్ర రత్నమాల.

తనిని మురాద్ పనిమీఁదికిఁ బంపి యతనికి వజీరునిగాఖాన్ ఖానను వానిని బంపెను. అప్పు డగ్బరు బర్హాణ పురమునకు వచ్చి డానియల్‌ను క్రీ. శ. 1599 వ సంవత్సరమున అహమ్మదు నగరముపైకి యుద్ధమున కంపెను.

ఈసమయమునందు నిజామ్‌శాహీలో మిగుల నవ్యవస్థగా నుండెను. చాందబీబీవంటి చాతుర్యవతి రాజ్యము చేయుచున్నను ఆసమయమునం దామెకు నచట విశ్వాసార్హు లగువా రెవ్వరును లేకయుండిరి. కాన నామె యేమియుఁ జేయలేక యుండెను. నేహంగఖాను చాందబీబీతో నేమో యాలోచించి వైరులను త్రోవలో నాటంకపఱు పఁబోయెను. కాని శత్రువులాతఁ డుండుత్రోవనురాక మఱియొకత్రోవతో వచ్చి పట్టణమును ముట్టడించిరి. అప్పుడు చాందబీబీ తన యాజ్ఞను వినువా రెవ్వరునులేక అప్పటికి రాజధానిని విడిచి బాలరాజునుగొని జున్న ననుగ్రామమునకు బోవ నిశ్చయించెను. కాని యామె సమీపముననుండు హమీద్‌ఖానను వాని కాయాలోచన సరిపడక చాందబీబీ పగవారికి రాజ్య మిచ్చు చున్నదని యూరంతటను సాటమొదలు పెట్టెను. అది విని దక్షిణితురకలు నిజమని తలఁచి హమీద్‌ఖానును ముందిడుకొని కొందఱు భటులు చాందబీబీ యంతపురము జొచ్చి యామెను జంపిరి. ఇట్లు హిందూస్థానపు ఇతిహాసములోఁ బ్రసిద్ధురాలయిన స్త్రీరత్నముయొక్క చరితము ముగిసెను. ఈమె ప్రధమమునందు విజాపురమున మఱఁది కొమారుఁడగు ఇబ్రాహిమ్‌ఆదిల్ షహా చిన్నతనమున నతని కొఱకు ఆదిల్ శాహిని రక్షించెను. పిమ్మట అహమ్మద్‌ నగరమున తన