పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

అబలాసచ్చరిత్ర రత్నమాల.

క్రీ. శ. 1526 వ సంవత్సరమున[1] బ్రాహ్మణీరాజ్యమను తురక రాజ్య మంత్యదశకు వచ్చెను. అప్పుడు దక్షిణమున నైదుగురు తురుష్కులు స్వతంత్రులయిరి. వారిలో విజాపురమునందు రాజ్యము చేయువారిని 'ఆదిల్ షహాల'నియు, గోలకొండయందలి రాజుల వంశమును 'కుదుబ్‌షహాల'నియు వర్హాడ (బీరారు) రాజులను 'ఇమాద్ షహాల'నియు, అహమ్మదనగర ప్రభుత్వమువారిని 'నిజామ్ షహాల'నియు, 'అహమదాబాదు నందలివారిని 'బరీద్‌షహాలని'యు వాడుచుండిరి. కాని కొన్ని రోజులయిన పిదప 'ఇమాద్ శాహి' 'బరీద్ శాహీలు' రెండునునాశమునొంది 'ఆదిల్ శాహి' 'నిజామ్‌శాహి' ;కుతుబ్ శాహీలు' మూఁడునుమాత్రము నిలిచెను. శాహియనఁగా రాజ్యమనియు షహా యనఁగా రాజనియు నర్థము.

భర్తజీవిత కాలమునందు చాందబీబీయొక్క చాతుర్యమంతగాఁ దెలియకుండెను. ఈమె భర్తయగు అల్లీ మిగుల భోగముల ననుభవింపుచు రాజ్యమునం దెంతమాత్రము దృష్టి లేక యుండెను. ఇట్లుండఁగా క్రీ. శ. 1580 వ సంవత్సరమునం దొక దినమునం దాయన యజాగ్రతగా నున్న సమయమునం

  1. డిల్లీలో గంగూయను బ్రాహ్మణుఁడు జఫీర్‌ఖానను తురకపిల్ల వానిని బాల్యమునఁ గొని పెంచి యింటిపని చేయుటకయి యుంచుకొనెను. పిదప నాచిన్నవాని బుద్ధివైభవముఁ గని యాతని యజమానుఁడు ద్రవ్యమక్కఱలేకయే యాతనిని దాస్యమునుండి విడిచెను. తదనంతర మాపిల్లవాఁడు దక్షిణమున రాజ్యము స్థాపించెను. అప్పుడతఁడు తనయజమానునియెడఁ గృతజ్ఞుఁడయి జఫీర్‌ఖాన్ గంగూ బ్రాహ్మణీయని తనపేరు పెట్టుకొనెను. ఆతని రాజ్యమే బ్రాహ్మణీరాజ్య మనం బరఁగెను.