పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/275

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చాందబీబీ

ఈశూరవనితకు నిజామ్‌శాహిలో మూఁడవపురుషుఁడగు హుసేన్ నిజామ్‌శహతండ్రి. ఆదిల్ శాహిలో నాల్గవ పురుషుఁడగు అల్లీ ఆదిల్ శహభర్త. వీరిరువురికిని పరస్పర కలహములుకలిగి యుండెను. కాని అహమ్మదనగరు విజాపూరు గోలకొండలకుఁ ప్రభువులయిన తురకషహాలు కూడి విజయనగరముపై దండు వెడలుటకు నిశ్చయించుకొనిన కాలములో, అహమ్మదనగరమునకు నధిపతియయిన హుసేనషహ, నిజామున కధిపుఁడయిన అల్లీషహాతో సఖ్యము చేయఁదలఁచి తన కూఁతురగు చాందబీబీని నతనికిచ్చి వివాహము చేసెను. తదనంతరము తలికోటలో క్రీ. శ. 1565 వ సంవత్సరమునం దీమహమ్మదియులకును విజయనగరాధీశ్వరుఁడగు రామరాజునకును యుద్ధము జరిగి విజయనగర సంస్థాన మడుగంటె ననుసంగతి హిందూదేశచరిత్రము చదివినవారి కందఱకును విదితమేగాని స్త్రీచదువరులకునీశాహీల సంగతి దిన్నఁగాఁదెలిసినంగాని ప్రస్తుత చరితము బోధపడదుగాన వాని వివరము నిందు గొంత సంగ్రహముగాఁ దెల్పెద.