పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/274

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
260
అబలాసచ్చరిత్ర రత్నమాల.

సదాచారము నెలకొలుపుట పురుషులకు సాధ్యముకాదు. కాఁబట్టి పురుషులు తమస్త్రీలనుమూఢదశయందుంచియే దేశమున కేమో మహోపకారమును చేయుదుమన్న దురహంకారము విడిచి వారితోడ్పాటును బొందియే సత్కార్యములను జేయఁ జూడవలెను. స్త్రీల సహాయ మున్నపుడే పురుషులకు విజయము గలిగిలోకమునకు సత్యమైన యుపకారము కలుగును. సద్విషయములలో స్త్రీల తోడ్పాటును పొందఁ దలఁచిన పక్షమున ముందుగా వారి నాశ్రయించి యున్న మూఢతాపిశాచము తొలఁగునట్లుగా వారిని విద్యావతులను గాను, వివేకు రాండ్రనుగాను జేసిమనకు సరియైన తోడ్పాటు చేయుటకు వారిని శక్తు రాండ్రను జేయవలెను."


Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf