పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
13
ఉమాబాయిదాభాడే.

రనేక కారణముల నారోపించి యుద్ధసన్నద్ధులైరి. ఆయుద్ధమునందు దాభాడే తన యసమానశౌర్యముఁ గనుపఱుప నాతని గెలుచుట దుస్తరమని తలఁచి బాజీరావు మిగుల నన్యాయముగా నాశౌర్యనిధిని సంగ్రామంబునం గూలనేసెను. ఈసంగతి త్రియంబక రావు తమ్ముఁడగు యశవంతరావు దాభాడేకుఁ దెలియఁగా నాతఁ డధికరోషా యత్తచిత్తుఁడయి బాజీరావు నంత మొందింపక యన్నగారిక్రియలు జరుపనని ప్రతినపట్టెను. అందుకు ఉమాబాయియు సమ్మతించి తానును యుద్ధమునకు వచ్చెదనని చెప్పెను. ఆవార్తవిని బాజీరావు మిగుల దైన్యము బొంది శాహును మధ్యస్థునిగరమ్మని వేఁడుకొనెను. అప్పుడుశాహు మహారాజాతనిం దనవెంటఁగొని తళేగామను గ్రామమునందు ఉమాబాయినిం గని బాజీరావు నాయమపాదములపైఁ బడవేసి "ఖండేరావు దాభాడేగారును, బాలాజీ విశ్వనాధరావును అన్నదమ్ములవలె నుండిరి. కాన నీకీబాజీరావును పుత్రసమానుఁడు. కాన నీతని యపరాధము మన్నించి రక్షింపుము." అని రాజ డుగఁగా నుమాబాయి తనమనముననుండిన వైరముఁ బాఱదోలి శరణాగతునకభయ మొసఁగెను.

తదనంతరమునందు మఱికొన్ని దినముల కీమె పుత్రుల నిద్దఱిని శాహుమహారాజుగారు అహమదాబాదు ఠాణాగెలుచుటకు వెళ్ళుఁడని యాజ్ఞాపించెను. పుత్రులు బాలురనియు వారిరివు రీకార్యమును నిర్వహింపఁ జాలరనియు నెఱిఁగినదై ఉమాబాయి వారితోఁ దానును ప్రయాణమయ్యెను. ఆమె వీరపత్నియు, వీరమాతయు నగుటవలన నామెకు యుద్ధమనిన నింటి పనివలె సాధారణమై యుండెను. ఇంతలో ఉమాబాయి యిరు