పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/268

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
254
అబలాసచ్చరిత్ర రత్నమాల.

లోకమంతటను వెల్లడియైనందున శంకరులవారు వీరితో వాదించి గెలుపొంద నెంచి యాగ్రామమునకు వచ్చి నీళ్లుగొనిపోవుచున్న యువతులను మండనమిశ్రునిగృహ మెచటనని యడుగఁగా వా రిట్లు చెప్పిరి : _

"ఎవని ద్వారమునందుఁ బంజరమున నుంచఁబడిన ఆఁడు చిలుక వేదము స్వత:ప్రమాణమా పరత:ప్రమాణమా యని చర్చించుచుండునో యాగృహమే మండనమిశ్రునిదని దెలిసికొనుము."

"పూర్వాకృత కర్మవలన, మన మిప్పుడు చేయుకార్యమునకు, ఫలము కలుగునా లేక పురుషప్రయత్నము వలన ఫలము కలుగునా యని యేద్వారములోఁ బంజరస్థలయిన శుకయువతులు వాదించుచుండునో యదేగృహము మండన పండితునిది యనుకొనుము."

"జగత్తు నిత్యయా యనిత్యమా యని యాడురామ చిలుక లేగృహముయొక్క సింహద్వారమునఁ బంజరమందు ముచ్చటించుచుండునో యాగృహమే మండనునిది యనుకొనుము."

వారట్లు చెప్పఁగా శంకరులవా రచటి కరిగి మండనునిచే వాదభిక్షగొనిరి. తరువాత సమస్తవిద్యాశారద యయిన సరసవాణిని సభకు నధిపతినిగా నేర్పఱచివారు వాదవివాదమునకు నుద్యుక్తులయిరి.

ఇట్లు కొన్నిదినములు వాదము జరిగినపిదప మండనుఁడు వాదమునందోడుట తటస్థ మయ్యెను. అప్పు డాతని నను