పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/267

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
253
సరసవాణి.

విడువుము. ఏలయనఁగా అట్టి నీయాటలు మాకు సంతోష జనకములనటుల నితరులకుఁ గానేరవు. స్త్రీలు వివాహమున కన్నఁబూర్వము తల్లిదండ్రుల యాజ్ఞలో నుండవలయును. తదనంతరము వారికిఁ బతియేగతి. కనుక నీవు పతి యాజ్ఞలోనుండుము. ఇందువలన నీకు నుభయలోకములలోఁ గీర్తి కలుగును. పతికంటెను మొదటలేచి స్నానము చేయుము. అతఁడు భోజనము చేయనిది భోజనము చేయకుము పతి గ్రామాంతరము వెళ్ళినయెడల భూషణాదులను ధరియింపకుము. ఇటుల నరుంధత్యాది పతివ్రతలు నడచినటుల నడచుటయే నీకు భూషణము. పతి కోపగించినయెడల మాఱు మాటాడకుము. ఆయన కోపమునంతను నోర్చుకొనుము. ఇటులఁ జేసిన నతఁడు నీపైఁ గోపమును వదలి ప్రేమింపఁగలఁడు. శాంతితో సాటి యేదియును లేదుసుమా. పతి యింట లేకుండినప్పుడు నతిధులెవరయిన వచ్చినయెడల వారినిఁ దిన్నఁగా సన్మానించి యాదరించి పంపవలయును. అటులఁ జేయనిపక్షమున వారిలో నెవరయిన మహాత్ములుండినయెడలఁ గులదాహమగును. అత్త మామలను తల్లిదండ్రులవలెఁ జూడుము. బావమఱఁదులను నన్నదమ్ములవలెఁజూడుము. వీరికిఁ గోపము వచ్చినయెడల నీకును, నీభర్తకును నెంత యన్యోన్య ప్రేమముండినను మీలో భేదము పుట్టింతురు."

ఇట్లు వారు గూఁతునకు బుద్ధులుగఱపి యామె నత్తవారియింటి కనిపిరి. ఆభార్యాభర్తలు తమనగరమునకు నరిగి గేహస్థాశ్రమమును జక్కఁగా నడుపుచుండిరి. ఇట్లు కొన్ని సంవత్సరములు గడచినపిదప నీదంపతుల విద్యాప్రావీణ్యము