పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/266

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
252
అబలాసచ్చరిత్ర రత్నమాల.

కదా? ఈపిల్లఁడు దూరముననుండువాఁడు. ఇతని కులశీలములు మనకుఁ దెలియవు. కనుక నిందునగుఱించి యేమి చెప్పఁగలను" అందు కతఁడు మండనమిశ్రుని విద్యాప్రభావమును బొగడి ధనమునకన్నను విద్యయే శ్రేష్ఠమనిచెప్పెను. అంత నాదంపతు లిరువురును కొమార్తెకా సంగతినిఁ దెలిపి యామెమనోభావము నెఱుఁగఁ దలఁచి యామె సన్నిధి కరిగి యాసంగతి నామె కెఱుకపఱచి నీ యభిప్రాయమేమని యడిగిరి. వారావార్త చెప్పినతోడనే యా బాల కపరిమితసంతోషము కలిగి యాసంతోషమున కామె మనసునం దిముడుటకుఁ జోటుచాలక రోమాంచరూపమున బయిటఁ బడెను. దానివలననే నామె యభిప్రాయమును వారెఱిఁగి యావచ్చిన బ్రాహ్మణులకుఁ దోడు తా మొకబ్రాహ్మణుని వరునిఁ జూచుటకును, లగ్ననిశ్చయము చేయుటకును బంపిరి. నాఁటికిఁ బదునాల్గవ దివసంబున దశమినాఁడు శుభచంద్రయుక్తమైన ముహూర్తమని వ్రాసి గణితమునందుఁ బ్రవీణయైన సరసవాణి తమబ్రాహ్మణుని చేతి కిచ్చెను.

అంత నాబ్రాహ్మణులు మువ్వురు కొన్ని దినములకు మండనునిగ్రామముఁ జేరి యతనితండ్రికి శుభ లేఖ నందిచ్చిరి. ఆయన దాని జదివికొని సంతసించి శుభదినమునందు బంధువర్గముతోఁ దరిపోయి కొమారుని వివాహము చేసెను.

కూఁతు రత్తవారింటి కరుగునపుడు సరసవాణి తల్లి దండ్రు లామె కిట్లు బోధించిరి. "ప్రియకుమారీ! నేఁటినుండియు నీకు నపూర్వమైనదశ ప్రాప్తమయినది. ఈసుస్థితికి యోగ్యమైనటుల నీవు ప్రవర్తింపుము. బాల్యమునందలి క్రీడలు