పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/260

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
246
అబలాసచ్చరిత్ర రత్నమాల.

యమును కట్టించి దానిలో విట్ఠలమూర్తిని స్థాపించెను. కాశీ యందలియు నితర స్థలముల యందలియు వర్తకశాలలలోఁ గొంతధనము ధర్మముక్రింద వ్యయపఱుపఁ బడుచుండెను.

ఇట్లు కొంతకాలము గడపిన పిదప నామెకు ద్వారకా యాత్రకుఁ బోవలయునని బుద్ధి పుట్టెను. అంత నామె మిగుల వైభవముతో నాయాత్రకుఁ బయలుదేఱెను. ఆమె పోవుచుండఁగా గాయకవాడ మహారా జామెను మిగుల నాదరముతోఁ బిలచుకొని పోయి తగినమర్యాదలు చేసిపంపెను. అచటి నుండి పోవునపుడు త్రోవలో నీళ్ళు దొరకనిచోట్ల నెల్ల నీమె బావులు త్రవ్వించి యూరివారికిని బాటసార్లకును గలయిబ్బందులను దొలఁగించుచుఁ జనెను. అచటియాత్ర సాంగముగాఁ జేసికొని పోయినదారినే తిరిగి స్వగ్రామము చేరెను.

వి. శ. 1908 వ సంవత్సర మాషాడశుద్ధ యేకాదశి రోజున నీపవిత్రురాలగు సాధ్వి పుణ్యలోకమున కరిగెను ! మరణసమయమునం దామెకు రమారమి 57 సంవత్సరముల వయ స్సుండెను. ఆమె మృతి నొందినందున కాపట్టణమునందలి ప్రజ లందఱును మిగుల దు:ఖించిరి.

రఖమాబాయిగారికి నిద్దఱుపుత్రిక లుండిరి. వారిలో పెద్దదియగు --బాయినిబాపూసాహెబ్ పణశీకర్‌గారికి నిచ్చి వివాహము చేసిరి. రెండవదగు చిమూతాయిని నానాసాహెబు కాకిగ్డేగారికి నిచ్చి వివాహము చేసిరి. వారిలో పెద్దామె కొమారుని రఖమాబాయిగారు పెంచుకొని యతనికి గణపతిరావు లేక దాజీసాహెబ్‌కిబేయని పేరుపెట్టిరి. చిన్నకూఁతురి వంశముసయితము వృద్ధిపొందుచునే యున్నది.