పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రఖమాబాయికిబే.

245

ఆమెకు సహోదరతుల్యుఁ డయిన రెసిడెంటు దొరగారును రాజ్యమునకు వారసుని నేర్పఱుచుటకై చేసిన కష్టము వారికే తెలియవలెను. కాని తదితరులకు తెలియఁజాలదు. ఏప్రెల్ నెల 4 వ తేదిని వేడ్(ఇది రెసిడెంటుపేరు) దొరగారి నచటినుండి మార్చి యాస్థలమునకు హ్యామిల్టన్ దొరను బంపిరి. అప్పుడు వేడ్‌దొరగారు హామిల్టనును తనతోఁదీసికొని రఖమాబాయివద్దకి వచ్చి యామెకు సహాయము చేయవలసినదని హ్యామిల్టన్ గారితోఁ జెప్పి నీ యిచ్ఛ యేమియని రఖమాబాయిని నాతఁడడిగెను. అప్పుడామె సంస్థానమువిషయమయి తనకుఁ గలవిచారమును వెల్లడి పఱచెను. అందుపై నాదొర సంస్థానము కొఱకు వారసు నేర్పఱుచుటయందు రఖమాబాయికి సహాయము చేయుమని హ్యామిల్టను గారితోఁ చెప్పెను. అందుపై భావుహోళకరుగారి యిద్దఱు పుత్రులలో నెవరిని బెంచుకొనవలయుననియోచనకొలఁది రోజులుజరుగుచుండెను. వారిలోఁ చిన్నవానిని మెచ్చి రఖమాబాయి చూపఁగా వానినే దత్తపుత్రునిగాఁ గొనిరి. ఈయనయే తరువాత తుకో మాహారాజని ప్రసిద్ధుఁడయ్యెను. తుకోజీరావు యావజ్జీవము రఖమాబాయిగారి యుపకారము మఱవక యామెను నామెవంశీకులను మిక్కిలి మన్నించుచునుండెను.

కొమారుఁడు పెద్దవాఁడయి వ్యవహారము చేయమొదలు పెట్టినపిదప రఖమాబాయి దానధర్మములయందే తనదృష్టి నిలిపి కాలము గడుపుచుండెను. ఆమె వారి ద్వారమునుండి రామేశ్వరమున కరుగుత్రోవలోనికి ననేకుల నంపి యక్క డక్కడ అన్న సత్రములను కట్టించెను. కాశియం దొక దేవాల