పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/257

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
243
రఖమాబాయికిబే.

లుని దివాన్‌ గిరినుండి తీసి ఆపని రావ్ జీత్రియంబకున కిచ్చిరి. పిదప రఖమాబాయి తన ద్రవ్యముతో వర్తకము చేసి దాని నధికముగా వృద్ధిపఱుపఁ జొచ్చెను. ఆమెవర్తకశాలలు హిందూస్థానమునం దంతటను నుండుటయేగాక చీనా దేశమునందు సహిత ముండెను. ఈవర్తకమువలన ప్రతిదినము లక్ష యిరువదియైదు వేల లాభము కలుగుచుండె ననియెదరు. ప్రతివర్తకశాలకును లక్షరూపాయిలు మూలధనము (అసలు) గా నుంచి ఆధనముతో నతఁడు సంపాదించు లాభములోఁ గొంతభాగ మాతనికి నిచ్చునట్టుగా నేర్పాటు చేసినందున నాశాలాధికారులు కపటము చేయక వర్తకము చక్కఁగా నడుపుచుండిరి. ఇట్లు 1827 వ సంవత్సరమునుండి 1833 వ సంవత్సరము అక్టోబరు నెలవఱకును ఆమె తనవ్యాపారమునె చక్కఁగా జేసికొనుచుండెను.

1833 వ సంవత్సరము అక్టోబరునెలలోనే మహారాజ్ మల్హార్ రావు హోళకర గారు దివి కరిగిరి. ఆయన పుత్రులు లేక గతించినందున నాతనిభార్య గౌతమ బాయియు తల్లి కేసరిబాయియు నాలోచించి మార్తాండరావను చిన్నవానిని దత్తునిగాఁగొనిరి. అప్పుడు రఖమాబాయి రాజమాతకు మిక్కిలి సహాయము చేసెను.

ఈసంధికాలములో నదివఱకు మహేశ్వరయను పట్టణమునందు రాజనిర్బంధములోనుండిన హరిరావ్ హోళకరను నాతఁడు బంధముక్తుఁడయి వచ్చి రాజ్యము చేయసాగెను. అప్పుడు కొన్ని కారణములవల రఖమాబాయి యిందూరు