పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

అబలాసచ్చరిత్ర రత్నమాల.

ముతో మదనపాలుని నొక సేవకునిచేఁ జంపించెను. ఇందువలన రాజ్యపాలనము మైసలదేవిపైఁ బడెను. మైసలదేవియు మిగుల దక్షతతో రాజ్యము నడుపుచు ప్రజలను బిడ్డలవలె నేలుచుండెను. మైసలదేవి, సామంతి, ముంజ, ఉదాయను ముగ్గురు జైనమంత్రుల సహాయముచే న్యాయముగా రాజ్యశాసనముల నేర్పఱచి ప్రజలను తదనుసారముగాఁ బ్రవర్థింపఁ జేసెను. ఆమె మోనరసమను తటాక మొకటియు, మలావను చెఱువొకటియుఁ ద్రవ్వించెను. నినిలో మలావను తటాకము కట్టునెడ నొకవేశ్యగృహము పడఁగొట్టినఁగాని యది యందముగాఁ గట్టుటకు వీలులేకుండెను. కాన రాణిగా రావేశ్యకు మిగుల ధనమిచ్చి దానియిల్లు గొనుటకు మిక్కిలి యుత్సహించెను. ఆవేశ్య తా నాధనముతీసికొని గృహము నియ్యననియు, మీరు తటాకము కట్టుటవలన మీ కెట్టికీర్తి కలుగునో దాని నడ్డగించుటచే నాకును నట్టికీర్తియే కలుగుననియు చెప్పెను. రాణిగారు న్యాయప్రవర్తనయందే చిత్తము కలదిగాన నెవరియాస్తియందు వారికిఁ బూర్ణాధికారము గలదని యెంచి వేశ్య నెంతమాత్రమును నిర్బందిపెట్టక దానియిల్లు వదలి చెఱువును వంకరగాఁ గట్టించెను. ఈ న్యాయమువలన నేఁటికిని ఆప్రాంతమునందలి ప్రజలు "న్యాయముఁగన నిచ్ఛగలవారు మలావతటాకమూ గనవలెనని" చెప్పుదురు.

ఆమె ప్రధానులును రాణిగారి యనుజ్ఞప్రకారము అనేక ధర్మకార్యములఁ జేసిరి. ఒకానొకసమయమునం దామె సోమనాధమునకుఁ బుత్రసహితయై యరిగి భాలోడను గ్రామమున యాత్రికులకుఁ బన్ను వలనఁ గలుగు బాధలఁగని కొమా