పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణీసంయుక్త.

11

డు కన్నులు లేకున్నను శబ్దముజాడపట్టి సూటిగా బాణమువేయునని చెప్పఁగా గోరీ యావిచిత్రమును గనుటకై యొకసభచేసి యాసభకు పృధివీరాజును బిలిపించియతనికి నతనివిల్లు బాణము లిచ్చి చమత్కారమే మయినఁ జూపుమని యాజ్ఞాపించెననియు, ఆమాటసూటినిబట్టి బృధివీరాజాతనిపై బాణమువేయ నాతఁడు (గోరి) మృతినొందెననియు, తదనంతరము చాందుభట్టు పృధివీరాజు లిరువురును దురకలచేఁ బడక యాసభయందే యొకరినొకరు పొడుచుకొని జీవములను విడిచిరనియు మఱికొందఱు చెప్పెదరు. పైనిజెప్పఁబడిన శరసంధానమహోత్సవ మంతయు మనదేశముననే జరిగినదని యొకరును, తురక దేశమున జరిగెనని యింకొకరును వక్కాణించెదరు. వీనిలో నేదినిజమో మనము చెప్పఁజాలము.

గోరీకి జయముకలిగి వాఁడు ఢిల్లీకి వచ్చుచున్నవాఁ డనిన వార్త వినఁగా పట్టణములోని స్త్రీలందఱితో సంయుక్త యగ్ని ప్రవేశము చేసెను. గోరీ ఢిల్లీకివచ్చి చూచు నప్పటికి గ్రామమంతట భస్మరాసులవిచ్ఛిన్నముగాఁ గానవచ్చుచుండెను.