పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/249

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
235
కృష్ణాకుమారి.

తనసైన్యములోని నవాబు ఆమీర్ ఖానను మ్లేచ్ఛునిచే చంపఁబడెను. ఈవిశ్వాసఘాతకుఁ డగు తురుష్కుఁడే పిదప ననేక యుక్తులచే నుదేపూర్ రాణాకు ముఖ్యస్నేహితుఁడయి అజిత సింహుఁడను నాతనినిఁ గృష్ణాకుమారి తండ్రికడ సేవకునిగా నుంచెను.

ఇంత సంగ్రామమయినను జయసింహ మానసింహుల కింకను యుద్ధమునందలి యిచ్చ తగ్గదయ్యెను. అందువలన వారిరువురును దళములతోడ ఉదేపురమునకు వచ్చుచుండిరి. కాన నాసంగతివిని భీమసింహ రాణా మిగుల చింతతో నాయుభయులను సమాధానపఱుచు నుపాయము విచారింపు చుండెను. ఆయన కేమియుఁ దోచక అమీర్‌ఖాను నేకాంతముగాఁ బిలిచి యాలోచన యడిగెను. అప్పు డాదుష్టుఁడు కృష్ణా కుమారిని మానసింహున కిచ్చుటొండె, చంపటయొండె యుత్తమమని చెప్పెను. ఈరెంటిలో కృష్ణాకుమారిని చంపుటయే యుత్తమమని రాజునకుఁ దోచెను. కాని స్త్రీహత్య జేయుట కాతని సేవకులలో నొకఁడును నొడంబడఁ డయ్యెను. భీమసింగుఁడు దౌలత సింగుఁడను సేవకునిం బిలిచి కొమార్తెను జంప నాజ్ఞాపించెను. అందు కాభృత్యుఁడు ప్రభువును తిరస్కరించి తానట్టిపనిని చేయనని నిశ్చయముగాఁ జెప్పెను. తదనంతరము రాణాగారు యౌవనసింహుఁ డనువానిం బిలిచి యీ ఘోరకర్మ చేయుమని చెప్పెను. ఈయౌవనసింహుఁ డట్టికార్యము చేయుటకుఁ దనకిష్టము లేకున్నను రాజాజ్ఞకు వెఱచి దాని కియ్యకొనెను. అంతనాతఁడు చేత ఖడ్గము ధరియించి యాకన్య నిద్రించు గృహమునకుఁ జనెను. కాని యానిద్రించు సౌం