పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/247

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
233
కృష్ణాకుమారి.

నవమానకరముగా నుండును. కాన రాణాగారు సమానవంశీకుని వెదకుచుండిరి. కాని యట్టి వరునకు విద్యాగుణములు సరిపడవయ్యెను. విద్యాగుణైశ్వర్యములు కలవరుని వెతకినచో వాఁడు కులీనుఁడు గాక పోవుచుండెను. ఇందువలనఁ గన్య నెవ్వరి కిచ్చుటకును కొంతవడి నిశ్చయింపనేరక తుదకు మార్వాడదేశపు రాణాయగు భీమసింహునకుఁ గన్య నియ్య నిశ్చయించెను. కాని ప్రారబ్దవశమున నల్పకాలములోనే మార్వాడ భీమసింహుఁడు స్వర్గస్థుఁ డయ్యెను.

తదనంతరము జయపురాధీశ్వరుఁ డగు రాణాజయసింహుఁడు కృష్ణాకుమారిని తనకిమ్మని యడుగుట కొకదూత నంపెను. ఉదేపూరాధీశ్వరుఁడును అందుకు సమ్మతించి కన్యను జయసింహున కిత్తునని చెప్పెను. ఇంతలో మార్వాడ దేశపు సింహాసనమున నెక్కిన రాణామానసింహుఁడు భీమసింగున కిటు చెప్పి పంపెను. 'ఇదివఱ కీసింహాసనముపై నున్న వానికి కన్య నిచ్చుటకు నిశ్చయించితిరి. విధివశమున నాతఁడు కాల ధర్మము నొందెను. అయినను నీకన్య యీసింహాసనమునకు వాగ్దత్తయయి యున్నది. కాన నాకియ్యవలయును. రాణాభీమసింగుఁడు మార్వాడ రాణాదూతతో మీరాజునకు నాకూఁతు నియ్యనని స్పష్టముగాఁ దెలియఁజెప్పి పంపెను. అందువలన మార్వాడ దేశమునకును మేవాడదేశమునకును వైరము సంప్రాప్తమాయెను. ఆరెండుదేశములయందును సంగ్రామ సన్నాహములు జరుగుచుండెను. ఆసమయమునందు గ్వాలేరురాజగు సిందే జయపురాధీశ్వరునిపై మిగుల వైరము కలవాఁడయి భీమసింగున కిట్లు వర్తమానమంపెను. "కృష్ణాకుమారిని జయపురపు