పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/244

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
230
అబలాసచ్చరిత్ర రత్నమాల.

మెను గనుఁగొని "పతికిసమ్మతిలేని ధర్మము నెప్పుడును సతిచేయఁగూడదు. చేసినయెడల దుర్గతికిఁ బాత్రమగును ఇఁకమీఁద నయినను నీవు బుద్ధి తెచ్చుకొని పతికి హితములగు వానినిఁ జేసినచో నాతనిగతి నొందఁగల" వని చెప్పఁగా నామె మరలిపోయెను. కాఁబట్టి పతికిసమ్మతముగా ననువర్తింపవలసినదే సతికి పరమధర్మము అధర్మవర్తనఁగల వనితలు అసురు లని పైశాచులని రాక్షసులని చెప్పఁబడు మూఁడు తెగల వారికిని సాధారణముగా వ్యభిచారమునం దనవరతము నిష్టము గలిగియుండును. వారిలో నాసురీవర్గమువారు సదా హృదయమునందు కౌర్య ముంచుకొనియుండుట. ధనధాన్యములను నాశ చేయుట, భోగములయందు కేవల మనురాగము కలిగి యుండుట అసూయపడుట, మొదలగు దుర్గుణములు కలిగెఁ వర్తింతురు. పైశాచికావర్గమువారు మనసునందు క్రోధమును సాధించుట, పతిసుతులయందు ద్వేషము కలిగియుండుట, గృహకృత్య వర్తనముల నేర్పుచాలకుండుట, కలహములయందిచ్ఛ గలిగియుండుట, మొదలగు దుర్గుణములు గలిగినడుచు కొనుచుందురు. రాక్షసీవర్గమువారు లేశమయిన సహనము లేకుండుట, యెల్లప్పుడు కల్లలాడుట, విశేషముగా నిద్రపోవుట సిగ్గులేక యుండుట మొదలగు దుర్గుణములు గలిగి నడుచుకొనుచుందురు. వీరందఱు నిస్సంశయముగాఁ బతివంశమువారిని నరకమునకుఁ బంపి తామును నరకమునకుఁ బోవుదురు. అట్టి దుష్ప్రవర్తనగల వనితలయినను తుదను తెలివి తెచ్చుకొని పతిభక్తిఁ గలిగి మికికిలి యనరక్తితో సత్కృత్యములుచేసి శాంతినివహించి వర్తించుచున్నచో మునుపుచేసిన