పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మావతి.

227

గాదా? అనసూయాదేవి నారదు లిచ్చిన యినుపసెనగలను బొరుగులగునట్టు వేఁచినది కాదా? ఆమెయే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తనకు బిడ్డలనుగాఁ జేసికొన్నది కాదా? అరుంధతీదేవి యిసుకను నిమిషములోపల వండినదికాదా? లక్ష్మీదేవి పరమశివునుఁ బట్టుకొన్న బ్రహ్మహత్యను వదలఁ గొట్టినది కాదా? పార్వతీదేవి పరమేశ్వరుని యర్థాంగమును సంపాదించుకొన్నదిగాదా? ఇటువంటి మహత్వమంతయు వారికి పాతివ్రత్యమువలననే గదా గలిగినది. చూడుము; అరుంధతీదేవి తక్కువజాతిలోఁ బుట్టినదయ్యును తనపాతివ్రత్యముచేత సప్తర్షి మండలమున వసిష్ఠులవారిదండను నిండుకాంతితో వెలయుచు లోకమునకు కన్నులపండువుచేయుచున్నది. ఒక్కపర్యాయము పత్నులమీఁది మోహముచేత మిక్కిలియార్తిచెందిన తనభర్తయగు అగ్ని హోత్రునియొక్క యిష్టాపూర్తి చేయునిమిత్తమయి స్వాహాదేవి తనమాహాత్మ్యమువలన ఆర్గుఱు ఋషిపత్నులరూపములఁ దాల్చియు, పరమపవిత్రురా లన్న హేతువుచేత నరుంధతీ దేవిరూపమును మాత్రము ధరించుటకు శంకించినదిగాదా? సత్కులప్రసూతయు సకల సంపన్నయు నయిన అహల్యదేవి మనోవైకల్యముచేత పాతివ్రత్యమును పాడుచేసికొన్నందుననే గదా పాషాణమయి పడియుండి చిరకాలము దు:ఖమనుభవించినది ? ఇప్పుడును వివాహ సమయములయందు సన్నికలు మిషమున నహల్యను కన్యచేతఁ ద్రొక్కించుటయు, నరుంధతీదేవి నగుపఱచి భక్తిపూర్వకముగా మ్రొక్కించుటయు, వాడుకగానున్నది కాదా? చక్కఁగాఁ బాతివ్రత్యము నొక్కటినిఁ గాపాడుకున్నచో బహువిధము