పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/233

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
219
విమల.

వచనములవలన తనభర్త చచ్చుట యబద్ధమనియు నతఁడే తనను తీసికొనివచ్చెననియుఁ దెలిసికొనియెను. తదనంతర మాదంపతులు మాఱువేషములతో రూపసుందరి యున్న యరణ్యమునకుఁ బోయిరి. రూపసుందరి, యచట నిదివఱకే ప్రసవమయి మొగశిశువును గనెను. ఆబాలుని పేరా చెంచులు వనరాజని పెట్టిరి. విమల వదినెను పుత్రసహితముగాఁ జూచి యపరిమితానందభరిత యయ్యెను. వా రాయరణ్యముననే గుప్తముగా కాలము గడపుచుండిరి. కాని విమల కచటి యరణ్యజలముపడక క్షీణించి కొన్నిదినములకు నామె దివి కరిగెను.


Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf