పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

అబలాసచ్చరిత్ర రత్నమాల.

నము చేయ నియ్యకుండెను. కాని యామెసద్గుణముల వలన సైనికులంద ఱామెపక్షమునే స్వీకరించి కర్ణుని చీవాట్లు పెట్టి యామెను సహగమనమునకు సిద్ధము చేసిరి. ఆమె చితి యొక గట్టుపైన నుండెను. విమల యచటి కరిగి తనను చూడవచ్చి తనకు నమస్కరించిన స్త్రీలకు పాతి వ్రత్యధర్మముల నుపదేశించి సైనికులకు బుద్ధులు గఱపెను. అంతవఱకుఁ బశ్చాత్తాప మను మాటలేని కర్ణుఁడు మిగులఁ బశ్చాత్తాపమును బొంది యామెను క్షమవేఁడెను. అప్పుడు విమల 'నీవు పరమేశ్వరుని క్షమ వేఁడుకొని మరల నిట్టి పాపకార్యములు చేయకుమ'ని యతనికిఁ బోధించి చితి నెక్కెను.

అచట సురపాలుఁడు గ్రామమును సమీపించి గ్రామము శత్రువులస్వాధీనమగుటయు రాజు యుద్ధమునఁ జచ్చుటయు విని మరల నరణ్యమునకు వచ్చెను. కాని యతని కచటఁ దన వారెవ్వరును గానిపించలేదు. కాని జరిగినవృత్తాంత మంతయు నొకకిరాతుని వలన విని యతఁడు కర్ణునివద్ద చెఱలో నున్న తనసతిని విడిపింపనరిగెను. సురపాలుఁ డల్పవీరులతో సోరట్ నగర సమీపముననుండి కర్ణునిని గెలుచు నుపాయము చింతించుచుండఁగా తనపత్ని సహగమనవార్త వినెను. అప్పుడాయన తా నొక్కఁడును మాఱువేషముతో నామూకలోఁ బ్రవేశించి చితిపై నెక్కి యగ్నిరవులు కొల్పుచున్న విమల నదాటున నెత్తుకొని యతివేగమున నరిగెను. సురపాలుఁడు విమల నెత్తుకొనిపోయి యొకగుఱ్ఱముపై నెక్కించుకొని యరణ్యమార్గమునఁ బోవుచుండెను. విమల కర్ణుఁడే తన నిట్లు తెప్పించెనని తలఁచెను. కాని కొంతసేపటికి సురపాలుని