పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/230

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
216
అబలాసచ్చరిత్ర రత్నమాల.

పతికంటె నధికుఁడుపర మేశ్వరుఁడు గలఁడనితలఁచి యాపరమేశ్వరునకు భయపడ వలయును. కాన నేను మీతోడ దుష్కార్యమున కొడిగట్టి జగదీశ్వరుని శిక్షకు లోనుగాను." భార్య చెప్పిన నీతికిని, నామెకుఁగల ధర్మబుద్ధికిని మిక్కిలి సంతసించి సురపాలుఁ డామె నాలింగనము చేసికొని తననిజమయిన యభిప్రాయ మామెకుఁ జెప్పెను. అప్పు డాదంపతు లిరువురు నాలోచించి తిరస్కా రోక్తులతో నొకజాబును కళ్యాణరాజునకు వ్రాసిరి. జాబుతెచ్చిన దూతను శిక్షించెదనని సురపాలుఁ డనగా దూతనుశిక్షించుట ధర్మము గాదని చెప్పి విమఒల వాని నంపించెను.

సురపాలుఁ డంపిన జాబును జూచుకొని భూవరుఁడు (కళ్యాణరాజు) మిగుల క్రోధించి విశేషసైన్యములతో మరల ఘూర్జరపతితోడి రణమునకు వచ్చెను. ఈపర్యాయము కొంత యుద్ధము జరిగిన వెనుక జయశిఖరునకు జయము దొరకునను నాసతగ్గెను. కాన నాతఁడు గర్భవతిగానున్న తన భార్యను, చెలియలిని నరణ్యమునం దెచటనైనను గుప్తముగానుంచి రమ్మని సురపాలుని నంపెను. అట్లు సురపాలుఁడు వారలను కిరాతులకు స్వాధీనముచేసి వారికిఁ గొందఱు వీరభటులను సహాయమున కుంచి మరల పట్టణము వైపునకుఁ బోవుచుండెను. ఇంతలో సురపాలుఁడు లేనందున భూవరుసైన్యములు మిగుల ధైర్యముతోఁ బోరాడి జయశిఖరుని జంపి పట్టణము నాక్రమించెను. అచట సురపాలుఁడు దొరకనందున నతనిని వెదకుటకయి కొంతసైన్యముతో భూవరుని కొమారుఁడు కర్ణుఁ డనువాఁడు బయలుదేఱెను, కాని సురపాలుఁడు వేరు