పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణీసంయుక్త.

9

"ప్రాణేశ్వరా! తమరుక్షత్రియులుగాన మీశస్త్రాస్త్రములను కాపాడుకొని యుద్ధమునకు సిద్ధమగుఁడు, క్షత్రియులు తమదేశముయొక్కయు వంశముయొక్కయు ప్రతిష్ఠలకొఱకు ప్రాణములని విడిచిన నది మృతియనంబడదు. మనుజుఁడు జన్మించినందుకు ఫలముగా సత్కృత్యములఁ జేసి సత్కీర్తినిబొంది యమరుఁడు కావలయును. తమకు జయము దొరకిన మరల మన మిరువురును సుఖమనుభవింతుము. లేనిపక్షమున నేనును తమతో స్వర్గసుఖ మనుభవించుటకు శీఘ్రముగ నేవత్తును." అని ధీరోక్తులు పలికెను. అందుకుఁ బృధివీరాజు తనభార్యను గౌఁగిలించుకొని "సతీమణీ! నాదేహములోఁ బ్రాణము లుండునంతవఱకు నేను శత్రునకు వెన్నియ్యనని దృఢముగానమ్ముము. నాసైనికులును కీర్తికాములేగాన వా రెప్పుడును పరాజయముఁ బొంది మరల తమముఖము లితరులకుఁ జూప నిశ్చయింపరని నేను నమ్మెద" నని చెప్పెను. ఆవాక్యములు విని సంయుక్త "స్వామీ ! ఢిల్లీలోని స్త్రీలు తమ్ముఁ దాము రక్షించుకొనుటకు నసమర్థురాండ్రుగాన నే నిపు డచటి కరిగి వారినందఱకును ధైర్యముచెప్పెదను. నేనిచటనే యుండిన నాకాంతలేమియుఁదోఁచక యుండెదరు. ఏది యెట్లయినను మిమ్మును గెలిచి యామ్లేచ్ఛుఁడు ఢిల్లీకిఁ వచ్చెనా వానికి రాజపూతస్త్రీ యొకతయయిన జీవముతో దొరక నేరదు." అని యామె ఢిల్లీకిఁ బోయెను. అచట నామె మిగుల నియమముతోఁ బరమేశ్వరుని తనభర్తకు విజయము నిమ్మని ప్రార్థన సేయుచుండెను. ఆమెయుపదేశము విని యానగరమునందలి యువతులందఱామెవలెనే ఢిల్లీశ్వరునకు