పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/228

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
214
అబలాసచ్చరిత్ర రత్నమాల.

మునకుఁ దీసికొనిపోయి యచట నొకమంచముపైఁ గూర్చుండఁబెట్టిరి. అప్పు డొకసింహము జయశిఖరునిపైకి రాఁగా దానిని సురపాలుఁడు మిగుల శౌర్యముతోఁజంపెను. దానింగని నప్పటినుండియు విమల సురపాలుని శౌర్యధైర్యములకు మెచ్చి యతనిని భర్తనుగా వరియింప నిశ్చయించెను.

అటుపిమ్మట జయశిఖరుని వీడ్కొని సురపాలుని తండ్రి పత్నీ పుత్రసహితుఁ డయిపోయెను. పిదపఁ గొన్నిదినములకు సురపాలుని చెలియలగు రూపసుందరిని తనకొఱకు భార్యగా నిశ్చయించు నిమిత్తమయి జయశిఖరుఁ డొక బట్రాజును ముల్తానాకుఁబంపెను. అపుడాబట్రాజుచేతికి విమల యొకయుత్తర మిచ్చి దానిని సురపాలున కిమ్మని చెప్పెను. వాడుదానిని సురపాలున కిచ్చెను. తరువాత రూపసుందరిని వివాహమాడుటకు జయశిఖరుఁడు ముల్తానాకుఁ బోయెను. వివాహానంతరము రూపసుందరికినిఁ దోడు సురపాలునిం దీసికొని జయశిఖరుఁడు తన దేశమునకు వచ్చుచుండెను. అప్పు డాత్రోవలో లాటదేశాధీశుఁడు తనకుఁ జెల్లింపవలసినపైకము బహుసంవత్సరములనుండియుఁ జెల్లించనందున జయశిఖరుఁడు వానిపైకి సైన్యమునంపెను. ఆ సైన్యాధిపతివెంట నతనికి సహాయునిగా సురపాలునిఁ దోడిచ్చెను. లాటదేశమున వీరికిని, వారికిని గొప్పయుద్ధము జరిగి జయశిఖరుని సైన్యాధిపతి చావఁగా సురపాలుఁడు వారిని గెలిచి యారాజును దెచ్చి జయశిఖరునకు నొప్పగించెను. అప్పుడుసురపాలుని శౌర్యమునకుమెచ్చి జయశిఖరుఁ డాతనికిఁ దన సేనానాయకత్వమునిచ్చి నగరమునకువచ్చినపిదపఁ దన చెల్లెలగువిమల నాతనికిచ్చి వివాహము చేసెను. విమల వివాహానంతరము పతి