పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/226

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

అబలాసచ్చరిత్ర రత్నమాల.

రాణిగారు డిల్లీపట్టణమునుండి బయలుదేరుట మిగుల దుర్ఘటముగా నుండెను. అయినను శూరవనితయగు రాణియు నామె సైనికులును మిగుల శౌర్యముతోఁ బాదుషాసైన్యముల నోడించి మేవాడదేశపు మార్గమునంబడిరి. ఆసమయమునం దారాణియనేక వీరబటులశిరములు తన చేతి ఖడ్గముతో డొ-- నేసిన నవి డిల్లీయంతట వెదచల్ల బడియెనఁట. ఇట్లు వారందఱు మేవాడ మార్గమున నడుచుచు రాజపుత్రుఁడగు అజిత సింహుఁ డున్నస్థలమునకు వచ్చిరి. తనపుత్రుని కెంతమాత్రము ప్రాణభయములేక సురక్షితుఁడయు యుండుటఁగని రాణిపరమానందభరిత యయ్యెను. అంత నామెపుత్రసహితయయి మేవాడయందున్న తనసహోదరునికడ కేఁగెను. తనకొమారుఁడు పెద్దవాఁడగునంతవఱకు విద్యాబుద్ధులు చెప్పి సంరక్షించు నటులఁ దనతోఁబుట్టువుచే నొప్పించుకొని యాశిశువు నాతని స్వాధీనము చేసెను.

అజితసింగు పెద్దవాఁడయినపిదప తనశౌర్యముచే మహమ్మదీయుల ననేకపర్యాయము లోడించిపంపెను. రాణియుఁ దనపుత్రుని సంగ్రామకేళి కెంతయు సంతోషించికన్న ఋణము తీఱెనని చెప్పుచుండెను. ఈరాణి వృద్ధయై కాలధర్మము నొందెను.