పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/225

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
211
జోధపురపురాణి.

ను. కాని గర్భవతియగుటచే యనుగమనమును మానవలసిన దాయెను. అట్టియసహ్యదు:ఖకాలమునం దామె బొత్తుగా ధైర్యమువదలక నిండుగర్భవతియైనను తానే రజపూత సేనాధ్యక్షతను వహించి హిందూస్థానమునకు మరలెను. కాని యింతలో కాబూలుదేశములో నే యామె ప్రసవమయి యొకపుత్రరత్నముంగ నెను. ఈశిశుసింహుండే తనతండ్రిని సహోదరునిఁ జంపిన ఔరంగజేబు పగతీర్చుకొన సమర్థుఁడయ్యెను! ప్రసూత్యనంతరము కొంచెముశక్తి రాఁగానే రాణిగారు మరల ప్రయాణముచేసిరి. వారు పేశావరీనగరమునకు వచ్చువఱకు శత్రువులచే మిగుల నడ్డగింపఁబడు చుండిరి. కాని యాగ్రామమునకు రాగానే జోధపురమునుండి వారికి సహాయార్థము బయలు దేఱిన రజపూత సైన్యము వారినిఁ గలసెను. కాన నచటి నుండి వారికిఁ బగరచే నంతగా బాధగలుగకుండెను. వారందఱు డిల్లీని సమీపించఁగానే మరల పెక్కుచిక్కులు ప్రాప్తించెను. జసవంతసింహునిభార్య అజితసింగ కుమారునితో సుఖముగ డిల్లివఱకు వచ్చుటవిని బాదుషామిగుల క్రోధించి నీకొమారుని నాకడ కంపుమని రాణికి వర్తమానమంపెను. ఈ సంగతివిని రాణిగారు తనకొమారుని నంపుటకు సమ్మతించక తనసైన్యబలముచేఁ బోరాడితన్నును, తనబాలకుని సంరక్షించు కొన నిశ్చయించెను. అంత నామె తనశిశువు నొక........ పెట్టెలోనుంచి యాపెట్టె నొకవిశ్వాసపాత్రుఁడగు తురు......... కిచ్చి దానినొక సురక్షితమగు చోటికిఁ గొనిపొమ్మని చెప్పెను. వాఁడును అదేప్రకార మాబుటనుగొని పండ్లు కొ....మిష చెప్పి నియమితస్థలమునకుఁ గొని చనెను.