పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/224

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
210
అబలాసచ్చరిత్ర రత్నమాల.

హులచే వ్యాపింపఁబడి యుండెను. కాన నాదంపతుల కచటి కరిగినపిదప విశ్రాంతి యన్నమాటయె తెలియదు. ఇట్లు జసవంతసింగు తనసైనికుల సహాయముచే నారాజద్రోహులను శాసింపఁ బ్రయత్నింపుచుండెను. ఆకష్టములలో వారికెటు చూచినను శత్రువుల భయము దప్ప మఱియేమియుం గానరాకుండెను. అచటి పర్వతజలమును, వాయువును వారిశరీరములకు సరిపడకపోవుటవలన వారికి మిగుల ప్రయాసమయ్యెను. ఇట్టిభయంకర సంగ్రామదివసంబులలో నాపతిభక్తిపరాయణ యగు రాణి గర్భవతిగా నుండియు భర్తను ఛాయవలె ననుసరించియుండి శూరపురుషునివలె నాతనికి సర్వవిధములఁ దోడుపడుచుండెను. ఆమెశౌర్యధైర్యములు గని రజపూతవీరులు మిగుల నాశ్చర్యపడుచుండిరి.

ఇన్ని కష్టములు పడినను రాణిగారికి సుఖప్రాప్తి లేదయ్యెను. కుటిలుఁడగు అవరంగజేబు జసవంతసింగు కాబూలులోనున్న కాలముననే విషప్రయోగము చేయించి యాతనిని చంపించెను. అదేప్రకారము పృథివీసింగును జోదపురమునుండి డిల్లీకి రప్పించి విషమిడి చంపించెను. జసవంతసింగుని వంశము మూలముతో నాశ మొందెనని ఔరంగజేబు సంతసింపు చుండెను. కాని యొకచిన్న యంకురము గలదని యెఱుంగఁ డయ్యె.

జసవంతసింగుని మరణానంతరము పరదేశము నందుండిన రాణి కష్టము లిట్టివని చెప్ప నెవ్వరివశము ? పతి మృతుఁ డయినతోడనే సహగమనము చేయుట యాకాలమునం దుత్తమముగా నెన్నఁబడుచుండెను. ఈరాణియు నట్లే చేసియుండు