పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/219

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
205
జసరేశ్వరి.

నీవార్త సైనికులకుఁ దెలియఁగా తమరాజు దుష్ప్రవర్తనము వలన దేవిగ్రామమును విడిచిపోయెను గాన జయము కలుగదని తలఁచి వారు నిరుత్సాహులయిరి. తదనంతరము వారి పిచ్చి నమ్మకమును పోఁగొట్టవలయునని రాజనేకరీతుల యత్నించెను. కాని వారందఱు తమరాజు దుష్టత్వము నెఱిఁగినవారలే కాన నాతనిమాటలను నమ్మక సంగ్రామరంగమును విడిచి పాఱిపోవఁదొడఁగిరి. కానఁ బ్రతాపాదిత్యుఁ డల్పకాలములోనే పగఱచేఁ జిక్కి కారాగృహవాసి యయ్యెను.

ప్రతాపాదిత్యుఁడు చేతఁ జిక్కిన తదనంతరము మానసింహుఁడు రాజధానియగు జేసోరుపట్టణముం గొనువేడ్క నాపట్టణమును సమీపించెను. కాని పట్టణము నలుదిక్కుల సంరక్షకులతో రక్షింపఁబడుచుండుటఁ గని యాతఁడు మిగుల వింతపడెను. దాని నెవరు రక్షించెదరని విచారింపఁగా ప్రతాపాదిత్యునిభార్యయగు జసరేశ్వరి తాను సైన్యాధిపత్యమును స్వీకరించి గ్రామసంరక్షణ మొనర్పుచున్నదని తెలిసెను. అందుపై నాతఁడు గ్రామము తనస్వాధీనపఱుపమని జసరేశ్వరికి వర్తమాన మంపెను. అందుపయి నామె స్వపరబల తారమ్యముల నెఱిఁగి మిగుల చాతుర్యముగా నిట్లు ప్రత్యుత్తర మంపెను. "నేను కోరిన కొన్ని సంగతులను మీరొప్పుకొనిన నగరము మీకొప్పగించెదను. నగరరక్షణమునకై రక్తధార లొడుపుట నిష్ప్రయోజన మని నే నెఱుఁగుదును. మీరు మాగ్రామమును కొల్లగొట్టుట మొదలగు బాధలఁ జరుప కుండిన పక్షమునను, నాభర్త యెచ్చటనుండునో యచ్చటనే నన్ను నుంచుటకు సమ్మతించిన పక్షమునను నిరాటంకముగా నీయూరు