పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జసరేశ్వరి.

203

ప్రతాపాదిత్యుఁడు రాణిమనస్సు మరల్ప ననేకయుక్తులను బన్నెను కాని వానివలనఁబ్రయోజన మెంతమాత్రమును కానరాకుండెను. అందుపైనాతఁడామెను భయపెట్టియు, బతిమాలియు, వసంతరాయులను జంపినయెడలఁ దమకుఁ గలుగులాభములనుదెలిపి వసంతరాయులు బ్రతికియుండఁగా నాకుసుఖము కలుగదని చెప్పెను. కాని రాణి తననిశ్చయమును విడువక "మీకు సుఖము కలిగినను దు:ఖము కలిగినను మీచే నట్టి పాపకార్యము జరగనియ్యన"ని స్పష్టముగాఁ దెలియఁజెప్పెను.

బహిరంగముగాఁ బినతండ్రినిఁ జంపుట దుర్ఘటమని తలఁచి ప్రతాపాదిత్యుఁడు కపటమును బన్నెను. అతఁడు తానదివఱకు చేసిన దుష్కార్యమునకుఁ బశ్చాత్తాపపడినటుల నటియించి వసంతరాయల సన్నిధికరిగి మిగుల వినయముతో నాతనికి నమస్కరించిక్షమియింపుఁడని వేఁడుకొనెను. కొమారునిపశ్చాత్తాపమున కెంతయు సంతసించి వసంతరాయు లాతనిని మిగుల గారవించెను. అందుపైరాజు పినతండ్రిని నేఁడు తమరు నాతోడభోజనమునకు వేంచేయుఁ డని వేఁడుకొనఁగాఁ గపట మెఱుఁగని యావృద్ధ రాజందునకు సమ్మతించెను.

ప్రతాపాదిత్యుఁడు పై కెంతసాధుస్వభావముఁ దాల్చినను ఆతని దుస్స్వభావము నెఱిఁగిన రాణి వసంతరాయుల పుత్రునిఁ దెచ్చి తనవద్ద దాచియుంచినపిదప భర్తను పినమామగారి వద్దికి పోవ నిచ్చెను. తదనంతరము వసంతరాయులు విందారగింప బయలుదేరెను. అప్పు డాయనకుప్రతాపాదిత్యుపై యించుక సంశయముకలిగి యొక పావురమును తనతోడఁ గొనిపోవుచు తనభార్య కిట్లని చెప్పెను. "ఈపావురము