పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారాబాయి.

187

స్వయముగాఁబోయి యచట నావశ్యకములయిన వాని నరసి తగిన బందోబస్తు చేయుచుండెను. ఇదిగాకయామె సైన్యముల నంపి మహమ్మదీయ సైన్యములను గెలుచుట కారంభించెను. ఔరంగజే బొకవైపున నీమెకోట నొకదానిని గెలువఁ బ్రయత్నించునంతలో రెండవ వై పాతని స్వాధీనములో నుండిన కోటల నైదాఱింటిని తారాబాయి గెలుచుచునుండెను. రామచంద్ర పంతొకపర్యాయము మహమ్మదీయులకు సహాయము చేయుచున్నాఁడని తోఁచి తారాబాయి కాతనియందు కొంచె మనుమానము కలిగియుండెను. కాని పిదప నాతఁడు పన్హాళ పావనగడ లనుదుర్గములను బహు శౌర్యముతో గెలుచుటఁ గని యామెకు నాతనిపైఁ గలిగిన యనుమానమును వదలి అత్యంత విశ్వాసార్హునిగా నతనినే స్వీకరించి విశేష బహుమానము చేసెను. పిమ్మట నామె పన్హాళ కిల్లాలోని కరిగి యచటనే యుండెను.

ఇట్లు కొన్ని సంవత్సరములు గడచినపిదప ఔరంగజేబు మరణానంతరము సంభాజీ కొమారుఁడగు శాహు విముక్తుఁ డయ్యెను. అతఁడు తన రాజ్యమునకువచ్చి పినతల్లిని తనరాజ్యము తన కిమ్మని యడిగెను. అప్పుడు రాజ్యపాలనదక్షురాలగు తారాబాయి రాజ్యమిచ్చుటకు సమ్మతింపక నీవు నిజమయిన శాహువు కావనియు వేషధారివనియు కొన్ని యాటంకములు చెప్పెను. కాని శాహునకుఁ గొందఱు సరదార్లు స్వాధీనులయినందున తారాబాయికిని, శాహుకును యుద్ధము జరిగెను. అప్పుడు తారాబాయి పాతారాపట్టణమును దన బావకొడుకగు శాహునకు వదలి కోలాపురమున తన కొమా