పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

అబలాసచ్చరిత్ర రత్నమాల.

అన్నము లేనందున మృతులైరి. అంతనామె కడుపులోనుండి వచ్చుదు:ఖమును బట్టజాలక మృతులైన బాలకుల నిద్దఱిని రెండుభుజములపై వేసికొని చేత నొకచిన్న కత్తినిఁ బట్టుకొని గంగా గోవిందసింహునిసమీపమునకుఁబోయి మిగుల కోపమురాఁగా నాకత్తితో నతనినిఁజంప నుంకించెను. అప్పు డామె జగన్నాధుని భార్య యని తెలిసికొని గంగా గోవిందసింహుఁడు మిగుల భయముచే దిగులొందెను. కాని యాతనిసమీపమున నుండు బంట్రోతు లామెచేతికత్తినిఁ దీసికొని యాబాలకులనొకరి కొప్పగించి యామె నచటనుండి వెడలఁగొట్టిరి. అప్పు డామె దు:ఖాతిరేకమువలన మతిభ్రమ కలదియై యన్న పానాదులను మఱచి వీధులలోఁ దిరుగు చుండెను.

గంగా గోవిందసింహుని క్రింది యధికారియగు దేవీసింహుఁడు సుందరలగు స్త్రీలనందఱినిఁబట్టి తెప్పించి యొకగృహమునం దునిచి, వారిని దొరలకడకంపి వారిశీలమును గొని దొరలయనుగ్రహము సంపాదింపుచుండెను. ఇందువలన కమలాదేవిని సహితము దేవీసింహుని చారులు పట్టుకొనిపోయి యాగృహమునం దునిచిరి. అచట నామె దేవీసింహుని కపటము నెఱిఁగి యొక చిన్నకత్తిని దనయొద్ద దాఁచియుంచెను. ఒకదిన మామెను దేవీసింహుఁ డొకదొరయింటికి నంపెను. ఆదొర కమలాదేవి నంటరాఁగానామె కత్తితోనతని యురమునఁ బొడిచెను. కాని యతనియెడల దుస్తులు దళముగానుండినందున నతనికి విశేషాపాయముగాక కొంచెము గాయమయ్యెను. అంత నాదొర కమలాదేవి నంపి యట్టి స్త్రీనిఁ బంపినందుకు దేవీసింహునిపై మిగుల కోపపడెను. దేవీసింహుఁడు కమలాదేవిని